ఐదేళ్ల కాలంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: ఎంపీపీ

నవతెలంగాణ – గోవిందరావుపేట
పిచ్చి కుక్కలు కోతుల బెడద నిర్మూలించాలని తీర్మానం జాతర ఆదాయంలో లక్నవరం చెరువు మరమ్మతులకు వాటా కేటాయించాలని తీర్మానం ఐదేళ్ల కాలంలో సహకరించిన అధికారులకు కార్యాలయ సిబ్బందికి అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామని మండల పరిషత్ అధ్యక్షుడు సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో ఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన ఎన్నో సర్వసభ్య సమావేశాల్లో ప్రజా సంక్షేమం కోసం అధికారులపై శాఖలపై ఒత్తిడి తేవడం జరిగిందని అదంతా ప్రజల సంక్షేమం కోసమేనని స్వార్థానికి కాదని అధికారులు అర్థం చేసుకోవాలని ఏది వ్యక్తిగతం కాదని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరుగుతున్న క్రమంలో ఎంపీటీసీ ఆలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పిచ్చి కుక్కలు కోతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నివారణకు కృషి చేయాలని అన్నారు. ఇందుకోసం పిచ్చికుక్కల మరియు కోతుల బెడద నిర్మూలన కొరకు సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశం జరుగుతున్న క్రమంలో పలువురు ఎంపీటీసీలు ప్రతి జాతరకు లక్నవరం విడుదల చేయడం వల్ల సాగును కోల్పోతున్నామని అన్నారు. దీనిలో భాగంగా లక్నవరం చెరువు నుండి ప్రతి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నీటిని విడుదల చేస్తున్నందున చెరువు మరమ్మత్తుల కోసం మేడారం జాతర ఆదాయంలో  లక్నావరము చెరువుకు వాట కేటాయించాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. విద్యాశాఖ సమీక్ష లో మండల విద్యాధికారి గొంది దివాకర్ విద్యార్థుల సంఖ్యను పెంచడంలో బడిబాట తదితర కార్యక్రమాలను నిర్వహించి సఫలీకృతం అయినట్లు తెలిపారు. చివరలో జడ్పిటిసి తుమ్మల హరిబాబు కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో సహకరించిన అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్, ఎంపీటీసీలు ఏడుకొండలు, చాపల ఉమాదేవి, ధరావత్ పూర్ణ, వెలిశాల స్వరూప, కో ఆప్షన్ సభ్యుడు ఎండి బాబర్, ఏఈలు అజిత్ కుమార్ హారిక నరసయ్య దేవ్ సింగ్ సయ్యద్ హర్షద్ ఉపేందర్ రెడ్డి క్రాంతి కుమార్ ఎంపీ ఓ సాజిదా బేగం ఎపిఓ ప్రసూన పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love