నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నటి ఎంపీ కంగన అధిక కరెంట్ బిల్లు వ్యవహారంపై హిమచల్ ప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు. గత కొన్ని నెలలుగా కంగన కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో.. పాత బకాయిలకు కొత్త బిల్లు జత అయ్యి అలా చూపించిందని తెలిపారు. చివరిగా ఆమె జనవరిలో కరెంట్ బిల్లు కట్టిందని.. ఆ తర్వాత పవర్ బిల్లు చెల్లించకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెల బిల్లులు కలిసి అలా చూపించిదని వెల్లడించారు. ఒక మార్చిలోనే కంగన ఇంటి కరెంట్ బిల్లు రూ.55000 వచ్చినట్లు బోర్డు పేర్కోంది. ఆమె కరెంట్ బిల్లు రూ.లక్ష దాటలేదని.. దాదాపు రూ. 91,000 వరకు ఉందని తెలిపారు. తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని బాలీవుడ్ నటి బీజేపీ ఎంపి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై హిమచల్ ప్రదేశ్ విద్యుత్ బోర్డు స్పందించింది.