- Advertisement -
నవతెలంగాణ – తుంగతుర్తి
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు పొందాలని ఎంపీడీవో శేషు కుమార్ అన్నారు. గురువారం గ్రూప్ 3 ఉద్యోగం సాధించి, సబ్ ట్రెజరీ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు తీసుకున్న, పంచాయతీ కార్యదర్శి దత్తును సన్మానించి మాట్లాడారు. ఈ మేరకు జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించి మంచి పేరు ప్రతిష్టలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సురేష్, రఘు, శ్రీకాంత్ రెడ్డి, జగదీష్, నాగరాజు, శ్వేత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



