- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో సర్పంచ్ ఆస్పత్వార్ అనిల్ కుమార్ తో కలిసి శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులు త్వరతగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. నిబంధనలు పాటించి ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు చెల్లింస్తుందని చెప్పారు. నిర్మాణాలు పూర్తైన వారు అలసత్వం వహించకుండా గృహ ప్రవేశాలను చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి కార్యదర్శి రమేష్ చారి, ఫీల్డ్ అసిస్టెంట్ సుభాష్, గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



