ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ – పెద్దవంగర
ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో వేణుమాధవ్ సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో వెళ్తేనే ఫలితాలు బాగుంటాయన్నారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలకు నీరు పట్టి కాపాడాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని కూలీలకు కనీస వసతులు కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గరిష్ట స్థాయిలో కూలీలకు డబ్బులు చెల్లించేలా పని కల్పించాలన్నారు. త్వరలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
Spread the love