
తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల ను నియమించారు మండలంలోనితాటిపాముల, మర్రి కుంట తండా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుమలగిరి ఎంపీడీవో ఉమేష్ చారి, వెలిశాల, చింతలకుంట తండా గ్రామాలకు తిరుమలగిరి తాసిల్దార్ రమణారెడ్డి, తొండ, ఎం సీ తండా గ్రామాలకు ఎం పి ఓ మారయ్య, రాజనాయక్ తండా, కోట్య నాయక్ తండ గ్రామాలకూ డిప్యూటీ తాసిల్దార్ జాన్ మొహమ్మద్, కన్నా రెడ్డి కుంట తండా, బండ్లపల్లి గ్రామాలకు పంచాయతీరాజ్ ఏఈ పి రవికుమార్, సిద్ధి సముద్రం, గుండెపురి గ్రామాలకు మండల వ్యవసాయ అధికారి డీ వెంకటేశ్వర్లు, రాఘవపురం , జలాల్ పూరం గ్రామాలకు ఎంఈఓ ఐ శాంతయ్య, మామిడాల, కొక్య నాయక్ తండా గ్రామాలకు వెటర్నరీ డాక్టర్ రజిత లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.