పోలియో చుక్కల కార్యక్రమంలో ఎంపీపీ

నవతెలంగాణ – తుంగతుర్తి
చిన్నారులు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా,చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు పోలియో చుక్కలు వేయించడంలో చిన్నారుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దని,మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని,నేటి నుంచి ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు,ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని సూచించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగమూర్తి,ఏఎన్ఎం భారతి,హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమన్న,లకావత్ యాదగిరి,అంగన్వాడీ టీచర్ శ్రీదేవి,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love