మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఆన్లైన్ కాంట్రాక్ట్ టెండర్ ను విధానాన్ని రద్దు చేయాలి

Municipal outsourcing online contract tendering system should be abolished– సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల కే ఇవ్వాలి: బిఎల్ టీయూ జిల్లా ప్రధాన మేకల రాజేందర్
నవతెలంగాణ – కంఠేశ్వర్
మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు జిల్లా ప్రధాన మేకల రాజేందర్ మాట్లాడుతూ 28న జరిగే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఖమ్మం, వరంగల్ తరహాలోనిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మార్చ్ 25 నుండి 28 వరకు నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జరిగిన నిరసన లో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 12 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు పని చెస్తున్నాయాయని వాటి వల్ల కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఎలాంటి సమస్యలు లేకుండా కార్మికుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఆదాయం పొదుపు అవుతుందన్నారు.హైదరాబాద్ కాంట్రాక్టర్ల వల్ల మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ డబ్బులు ఒక కోటి యాభై లక్షల రూపాయలు హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉన్నాయని గత నాలుగు సంవత్సరాలుగా బిఎల్ టీయూ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ఇటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అటు హైదరాబాద్ కాంట్రాక్టర్లు పట్టీంచుకోవడంలేదని మేకల రాజేందర్ తెలిపారు.కేవలం ఆన్లైన్లో టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న హైదరాబాద్ కాంట్రాక్టర్లు నెలకు 2 లక్షల యాభై వేల కమిషన్ పొందుతున్నారని దండి వెంకట్ తెలిపారు. ఖమ్మం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ల తరహాలో కార్మికులతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకే పారిశుద్ధ్యం, వాటర్ సెక్షన్ తదితర పనులు నిర్వహించాలని నాలుగు సంవత్సరాలుగా బిఎల్ టీయూ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన నిర్వహించినా మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం కార్మికులకు ఒక కోటి యాభై లక్షల రూపాయల పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ డబ్బులు పెండింగ్ పెట్టిన వారికి ముఖ్యంగా కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న హైదరాబాద్ కాంట్రాక్టర్లకు సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చి ఆన్లైన్ టెండర్ లో పనులు అప్పగించడం లో ఆంతర్యం ఏమిటిని దండి వెంకట్ ప్రశ్నించారు. 28న జరిగే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్.మురళి,కొమ్ము రాహుల్, డ్రైవర్స్ యూనియన్ అద్యక్ష కార్యదర్శులు ఎం. ఎల్లయ్య, నవీన్, సాయిలు, మోహన్ గౌడ్, మోహన్ లతోపాటు కార్మికులు పాల్గొన్నారు.

Spread the love