
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గుట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి శవం ఆదివారం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం మామిడిపల్లి గ్రామానికి చెందిన పల్లపు మైశయ్య(65) ప్రతి రోజూ మేకలు మేపుతు జీవనం కొనసాగిస్తాడని తెలిపారు. ఆయనకు నలుగురు కొడుకులు, బార్య ఎల్లవ్వ ఉన్నారు. మైశయ్య నాలుగు రోజుల క్రితం అదృశ్యమై య్యాడని, కుటుంబ సభ్యులు వేతుకుతుండగా ఆదివారం స్థానిక గుట్ట ప్రాంతంలో శవమై కనిపించాడన్నారు. మృతునికి డొక్కలొ కట్టే గుచ్చినట్లు ఉందని, ఎవ్వరో హత్య చేసి ఉంటారని గ్రామస్థులు, కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై సుదీర్ రావు, సిఐ సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు మృతుని బార్య ఎల్లవ్వ పిర్యాదు మేరకు కేసు నామోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.