
గాంధారి మండల కేంద్రంలోని ముస్లింలకు గాంధారి మండలం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూర్పు రాజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ మిత్రులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రజలందరూ బాగుండాలని సమాజంలోని చెడును పారద్రోలి మంచి మార్గంలో నడవాలని ప్రార్థించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా. స్థానిక ఎస్సై ఆంజనేయులు, ఏఏంసి చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు అశోక్ రెడ్డి, గాండ్ల లక్ష్మణ్ , ఏం సి డైరెక్టర్ బొమ్మని బాలు, మండల కోఆర్డినేటర్ నీల రవి, Y గోపాల్ ప్రశాంత్, మైనార్టీ నాయకులు సయ్యద్ అహ్మద్, మైనార్టీ సదర్ ముస్తఫా సయ్యద్ బషీర్ ఇంజనీర్ అమ్మద్ పర్వేజ్ ,గౌస్ ముర్తాజా. మజీద్ కమిటీ సభ్యులు మైనార్టీ యువకులు పాల్గొన్నారు.