జగన్‌ ప్రభుత్వం కూలిపోవడమే నా లక్ష్యం

My goal is the collapse of Jagan's government– పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఓడిపోవాలి
– ఐదేండ్లుగా న్యాయం కోసం ఒంటరి పోరాటం
– వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వారికి కఠిన శిక్ష పడాలి : డాక్టర్‌ నర్రెడ్డి సునీత రెడ్డి
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోవడమే తన లక్ష్యమని మాజీ మంత్రి వైఎస్‌.వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వైఎస్‌ కుటుంబ నేపథ్యాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రానున్న ఎన్నిక ల్లో ఏపీలో కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌. అవినాష్‌ రెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌ సీపీని చిత్తుగా ఓడిపోవడమే తన లక్ష్యమన్నారు. తమ నాన్న వైఎస్‌.వివేకానంద రెడ్డిని హత్య చేసిన, చేయించిన వారికి రాజకీయ భవిష్యత్‌ ఉండకూడ దన్నారు. వారికి కఠిన శిక్ష విధించాలని కోరారు. హత్య చేసిన వారికి చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం ఉండకూడదన్నారు. తనకు జరిగిన నష్టం, ఆవేదన, బాధ మరొకరికి జరగకూడదనే న్యాయం కోసం ఐదేండ్లుగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని తెలిపారు. తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు తెలియజేస్తే వారే ఎన్నికల్లో ఓటు వేసే ముందు తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జగన్‌ జైలుకు వెళ్లిన ప్పుడు పార్టీని షర్మిల కాపాడారని, ఎన్నికల్లో గెలిపించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆమె ఇమేజ్‌ పెరుగుతుందనే జగన్‌ పక్కనబెట్టి మోసం చేశారని ఆరోపించారు. కడపలో షర్మిల వెంట ఉంటానన్నారు. న్యాయం కోసం తాను పడుతున్న కష్టాన్ని చూసి కొందరు ఐఏఎస్‌ అధికారులు, వైసీపీ నేతలు బాధపడిన సందర్భాలు ఉన్నాయ న్నారు. ఐదేండ్లుగా న్యాయం కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్నానని, తన పోరాటం వెనుక ఏ పార్టీ, నాయకుడు లేరని స్పష్టం చేశారు. తన ఈ న్యాయ పోరాటంలో ఎన్నో అడ్డంకులు, ఇబ్బం దులను సృష్టిస్తున్నారని వాపోయారు. న్యాయం కోసం పోరాడేందుకు దేవుడు తనకెంతో శక్తిని ఇచ్చారని, తాను కాకపోతే ఇంకెవరు వారికి శిక్ష వేయిస్తారని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డిని దస్త గిరి చంపారనేది ఆరోపణ మాత్రమేనని, దస్తగిరి నాలుగో నిందితుడని తెలిపారు. తన తండ్రి హత్య కేసులోని నిందితులు, నేతలను విడిచిపెట ే్టది లేదని, తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరా టం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Spread the love