Saturday, August 29, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నాగార్జున ‘కింగ్ 100‘ గ్లింప్స్ విడుద‌ల‌..

నాగార్జున ‘కింగ్ 100‘ గ్లింప్స్ విడుద‌ల‌..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున కెరీర్‌లోని ప్రతిష్టాత్మక 100వ సినిమా సందడి మొదలైంది. ‘కింగ్ 100’గా ప్రచారంలో ఉన్న ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. సినిమా టైటిల్‌ని ‘కింగ్ 100’ అని పెట్టడం గమనార్హం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ నిర్మాణంలో తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. మ‌నుషుల్లో రెండు ర‌కాలు.. ఒక‌టి డ‌బ్బున్న వాళ్లు, మ‌రొక‌టి డ‌బ్బు లేని వాళ్లు అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో నాగార్జున‌ని ప‌రిచయం చేశారు.

గ్లింప్స్ చూస్తుంటే డబ్బు లేని ఓ పేదవాడు కసిగా ఎదిగి, మోసాలు చేస్తూ బాగా సంపాదించి కింగ్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది చిత్రంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. మ‌రోవైపు చిత్రంలో ఫాదర్ ఎమోషన్ కూడా ఉండబోతుంది అని, నాగార్జున ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ వర్షన్ లో కూడా కనిపించబోతున్నట్టు అర్ధ‌మ‌వుతుంది. చిన్న గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే చిత్రంపై భారీ హైప్‌ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అంశం టబు ఎంట్రీ. గతంలో నాగార్జున, టబు కలిసి నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు గ్లింప్స్ తో తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -