Wednesday, May 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం

నాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలను వాడుకుంటున్నారంటూ దాఖలు చేసిన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన చిత్రాలతో టీ-షర్టులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిపై మంగళవారం జస్టిస్ తుషార్ రావు గెడెలా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. విచారణ సందర్భంగా “నాగార్జున ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని సదరు వ్యాపారిని కోర్టు నిలదీసింది. దీనికి వ్యాపారి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘ది ఘోస్ట్’ సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని, ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా నిర్మాణ సంస్థతో ఒప్పందం ఉందని తెలిపారు. నాగార్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్ చేశారని కూడా వాదించారు.

అయితే, నాగార్జునతో గానీ, సినిమా నిర్మాణ సంస్థతో గానీ తమకు ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని విచారణలో వ్యాపారి అంగీకరించారు. ఈ వాదనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “ప్రత్యక్ష ఒప్పందం లేదని మీరే చెబుతున్నప్పుడు, ఈ టీ-షర్టులను విక్రయించే చట్టబద్ధమైన హక్కు మీకు ఎక్కడిది?” అని ప్రశ్నించింది. దీంతో, సంబంధిత ఒప్పంద పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించడానికి తమకు అవకాశం ఇవ్వాలని వ్యాపారి తరఫు న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -