30 సంవత్సరాల ఎస్సి ఏ,బి,సి,డి వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరుల త్యాగం మరువలేనిదని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ శిఖరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేంద్ర మాదిగ అన్నారు. మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో జూలై 7న హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు గత మూడు దశాబ్దాలుగా మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పాలకులు మాదిగలను కేవలం ఓట్లేసే యంత్రాలు గానే చూస్తున్నారు. తప్ప వర్గీకరణ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించారని మండిపడ్డారు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ పార్లమెంటులో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జులై 7న హైదరాబాద్లో జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభకు రాష్ట్రం నలుమూలల నుండి మాదిగ జర్నలిస్టులతో పాటు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వోల్దాస్ ప్రవీణ్ మాదిగ కనుక రవి గుడి పూరి ప్రభాకర్ ఊట్కూరి రవీందర్ రెడ్డి బిక్షం రూథర్ నందిపాటి సైదులు వేల్పుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.