హైదరాబాద్ : ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటీసీ లిమిటెడ్ తన ఆశీర్వాద్ మసాలలు బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు నానీని నియమించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆయన ప్రచారాన్ని ఉపయోగించు కోనున్నట్టు ఐటీసీ లిమిటెడ్ స్పైసెస్ బిజినెస్ హెడ్ పియూష్ మిశ్రా పేర్కొన్నారు. మసాలాల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు వెల్లడించారు.