నత్తనడకన పైప్‌లైన్‌ పనులు

నత్తనడకన పైప్‌లైన్‌ పనులు– తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, స్థానికులు
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
శివరాంపల్లి ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వరదనీటి పైప్‌లైన్‌ పనులు అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది. పైప్‌లైన్‌ కోసం తవ్విన గుంతల వలన శివరాం పల్లి రహదారి మొత్తం మట్టి గుంతలతో నిండిపోయింది. దీంతో కాలనీలోకి రావాలంటే సుమారు 4 కిలోమీటర్లు వేరే రహదారి గుండా వెళ్లాల్సి వస్తుంది. కాంట్రాక్టర్‌ నిర్ల క్ష్యం వలన ఇక్కడ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఈ పనులను పర్యవేక్షించవలసిన ఇంజనీరింగ్‌ అధికారులు ఈ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ రహదారి పైనే శివరాం పల్లి ప్రభుత్వ పాఠశాల ఉండడం సుమారు రోజు 1500 మందికి పైగా విద్యార్థులు ఈ రహదారి గుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే గుంతల పక్కనుంచి విద్యా ర్థులు నడుచుకుంటూ వెళ్లడం దాని పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండడం వలన విద్యార్థులు భయం గుప్పిట్లో తమ ప్రయా ణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చే యాల్సిన విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు పలు మార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో కాలనీలో నుంచి బయటకు రావ డానికి అవకాశం లేకుండా పోయిందని స్థానికులు వాపో తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులను త్వరగా పూర్తి చేయాలని లేనిచో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్థానికులు స్పష్టం చేశారు.

Spread the love