మోడల్ కాలనీలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే..

నవతెలంగాణ – ధర్మసాగర్ 
మండల కేంద్రంలోని మోడల్ కాలనీలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో భాగంగా 15 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల గల మహిళలకు,0-5 పిల్లల ఆరోగ్య  సమస్యలపై శనివారం సర్వే నిర్వహించడం జరిగిందని సర్వే సూపర్వైజర్ నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0-5 సంవత్సరాల పిల్లలకు ఎదుగుదలలో బరువుకు తగ్గట్టుగా తగ్గట్టుగాఎత్తు ఉన్నారా లేరా అని పరీక్షించామని తెలిపారు. 15-45 సంవత్సరాల  మహిళలకు బిపి,షుగర్,ఫీవర్,థైరాయిడ్ లాంటి వ్యాధులతో పాటు కరోనా వ్యాక్సిన్ లాంటి తదితర వివరాలను వాటికి సంబంధించిన పరీక్షలను క్షుణ్ణంగా సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ సర్వేలలో ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వ నివేదికల్లో పొందుపరిస్తామని వివరించారు. ఏవైనా మహిళలు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నట్లయితే వాటిని వారికి తెలియపరచి తగిన సత్వర చర్ర్య చేపట్టే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు సుమలత,సునీత,ఫీల్డ్ ఇన్వెస్ట్ గేటర్ ఆదిలక్ష్మి,భవాని,రమ్య,ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్,పుష్ప తదితరులు పాల్గొన్నారు.
Spread the love