నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ’72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల’ ప్రకటన వాయిదా పడినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ఈరోజే ప్రకటించనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. విజేతల జాబితా కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు, సినీ పరిశ్రమ వర్గాలకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం వంటి ప్రధాన పురస్కారాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోరుగా చర్చించుకున్నారు. అయితే, నేషనల్ ఫిలిం అవార్డ్సును ఈరోజు ప్రకటించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అవార్డుల ప్రకటనను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పురస్కారాల ప్రకటన తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని మీడియా సమాచారం. జూరీ సభ్యుల తుది నిర్ణయం అనంతరం పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వాయిదా..!
- Advertisement -
- Advertisement -



