జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాలు

National Library Anniversaryవిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఆలోచనా పరిధిని విస్తతం చేసుకోవడానికి, ఉన్నత వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి, మనిషికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటన్నింటిలోకెల్లా అత్యుత్తమమైనది పుస్తక పఠనం. ఆ పుస్తకాల ఆలయమైన గ్రంథాలయాలు… ఆ గ్రంథాలయాల పండుగ అయిన గ్రంథాలయ వారోత్సవాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సరిగ్గా 57 సంవత్సరాల కింద 1968వ సంవత్సరంలో నాటి గ్రంథపాలకులు శ్రీ చక్రవర్తి అభ్యర్థన (1960) మేరకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ గ్రంథాలయాలలో గ్రంథాలయ వారోత్సవాలు జరిపేటందుకు ఆమోదం తెలిపింది. భారత వైజ్ఞానిక మంత్రిత్వ శాఖ వారు లాహౌర్‌ లో పౌర గ్రంథాలయ సదస్సును నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అర్హులని, ప్రజారంగంలో ఉన్నవారికి అవగాహన ఉండదని ప్రభుత్వం భావించి వారికి ఆ సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించారు. గ్రంథాలయ ఉద్యమ నాయకులు, ఇది బ్రిటిష్‌ పాలకులు తమకు చేసిన అవమానానికి లాహౌర్‌ లో జరిగిన సదస్సుకు దీటుగా 1919 నవంబర్‌ 14, 15 తేదీలలో రెండు రోజులపాటు మద్రాస్‌ గోకలేహాల్లో తొలి జాతీయ గ్రంథాలయ సదస్సు జరిగింది ఈ సదస్సు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య అపూర్వమైన రీతిలో నిర్వహించారు. కూడల్కర్‌ ఈ సభకు అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల నుండి గ్రంథాలయ నాయకులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో గ్రంథాలయ ఉద్యమం వ్యాప్తికి తొలి సంకేతం ఇచ్చిన నవంబర్‌ 14 వ తేదీని జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినంగా జరుపుకోవాలని అదేవిధంగా ఈ వారం రోజులపాటు వారోత్సవాలను జరుపుకునేందుకు భారత ఆర్థిక శాఖ అనుమతుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలలో వారోత్సవాలు నిర్వహిస్తారు.
నవంబర్‌ 14 నుండి 20 వరకు ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు ఆయా గ్రంథాలయాలను అందంగా అలంకరించి గ్రంథ సంపదను ప్రజలందరికీ తెలియజేసే తగు ప్రచారాన్ని చేయడం, నూతన సభ్యులను చేర్పించడం, లైబ్రరీ సభ్యత్వాన్ని పెంచడం, ఇంకా తిరిగి అపురూప పుస్తకాలను సేకరించడం, పుస్తకాలను విరాళంగా ఇవ్వండం, మహిళలు, బాల బాలికలకు విద్యార్థు లకు విజ్ఞానదాయక పోటీలు నిర్వహించడం, సాంస్కతిక కార్యక్రమాలతో పాటు ఆయా గ్రంథాలయ కమిటీ లేదా గ్రామస్తుల సహాయ సహకారంతో గ్రంథాలయానికి నూతన ఫర్నిచర్‌, టేబుల్లు ఫ్యాన్‌, మంచినీటి సౌకర్యం, సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.

గ్రంథాలయ వారం లక్ష్యాలు:
పఠనం ప్రాముఖ్యతను ప్రచారం చేయడం, లైబ్రరీల ప్రాముఖ్యతను ప్రచారం చేయడంతో పాటు వ్యక్తిగత, వత్తిపరమైన వద్ధిని ప్రోత్సహిస్తుంది. Discover your passions and achieve your goals at the Library.- Misty Copeland చెప్పినట్లు గ్రంథాలయాలు మన సమాజంలో బహుముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి నాలెడ్జ్‌ రిపోజిటరీలు, ఎడ్యుకేషనల్‌ హబ్‌లు, సంస్కతి పరిరక్షకులు, అక్షరాస్యత ప్రమోటర్లుగా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే ప్రస్తుత కాలంలో గ్రంథాలయ వారోత్సవాలు నిజంగా అన్ని పౌర గ్రంథాలయాలలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం నుండి గ్రామ కేంద్ర గ్రంథాలయం వరకు, విద్యా గ్రంథాలయాలలో ప్రాథమిక పాఠశాల గ్రంథాలయం నుండి విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల వరకు వారోత్సవాలు నిర్వహించాలి.
పౌర గ్రంథాలయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలవు, సామాజిక సమానత్వాన్ని పెంపొందించగలవు, నాణ్యమైన సమాచారం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయగలవు. అయితే మనకు అలాంటి గ్రంథాలయాలు ఉన్నాయా? అని సమీక్షించుకుంటే… గ్రంథాలయాలు కమ్యూనిటీ సెంటర్లుగా, వత్తి శిక్షణా కేంద్రాలుగా లేదా సాంస్కతిక కేంద్రాలుగా సేవలంది స్తున్న ఈ సందర్భంలో నిజంగా పౌర గ్రంథాలయాలలో సరియైన మౌలిక వసతులు, పుస్తక వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులు, ఉన్నాయా అని మనం ఆలోచించిస్తే భారతదేశంలో పౌర గ్రంథాలయాల మౌలిక సదుపాయాల అభివద్ధిని పర్యవేక్షించడానికి జాతీయ చట్టం లేదా జాతీయ విధానాన్ని రూపొందించ వలసిన అవసరం ఉన్నది.
విద్యా గ్రంథాలయాలలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ఏదో నామ మాత్రమే నిర్వహి స్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌర గ్రంథాలయాలలో గత కొన్ని దఫాలుగా గ్రామీణ గ్రంథాలయాలలో, మండల గ్రంథాలయాల్లో వారోత్సవాలు నిర్వహించడం లేదు. జిల్లా , ప్రాంతీయ గ్రంథాలయాలలో, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాలలో మాత్రమే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణమా, సాంకేతిక సమస్యల కారణం ఏదైనా అయి ఉండవచ్చు అన్ని గ్రంథాలయాలలో వారోత్సవాలు నిర్వహించాలి.
తెలంగాణ రాష్ట్రంలో 537 శాఖా గ్రంథాలయాలు, 33 జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, 3 రీజినల్‌ లైబ్రరీలు, మొత్తం 573 అందుబాటులో ఉన్న పుస్తకాలు 68 లక్షలు 5లక్షలు, గ్రంథాలయాల్లో సభ్యులు 2.5 లక్షలు నిత్య సందర్శకులు
ఆన్‌ డిమాండ్‌ బుక్‌ సిస్టం:
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు చక్కటి కార్యక్రమం అని చెప్పవచ్చు ఇంతకాలం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలను మాత్రమే చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉద్యోగార్థుల అభిరుచులు, అవసరాల మేరకు పుస్తకాలను తెప్పిస్తున్నారు. ఏ పుస్తకం కోరుకుంటే, ఆ పుస్తకాన్ని మార్కెట్‌ నుంచి తెప్పించి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దీనికోసం ‘ఆన్‌ డిమాండ్‌ బుక్‌ సిస్టం’ను ప్రవేశపెట్టారు. ఈ సిస్టం ప్రకారం రిజిష్టర్‌లో ఉద్యోగార్థులు, పాఠకులు తమకు కావాల్సిన పుస్తకం పేరు రాస్తే, ఆయా పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంటే వారం, పది రోజుల్లోనే తెప్పిస్తున్నారు.
భారతదేశంలో సుమారు లక్ష పైచిలుకు పౌర గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి. వాటిలో 70, 817 గ్రామీణ గ్రంథాలయాలు, 4580 పట్టణ గ్రంథాలయాలు. 830 మిలియన్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు, 370 మిలియన్ల పట్టణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అంటే 11,500 గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక గ్రంథాలయం, పట్టణ ప్రాంతాల్లో 80 వేల మందికి ఒక గ్రంథాలయం సరైన సేవలందిస్తున్నాయి.
నేషనల్‌ మిషన్‌ ఫర్‌ లైబ్రరిస్‌ వారి ప్రకారం జనావాస ప్రాంతంలో 15, 10, 71, 9 81 జనాభాకు 1,89, 016 గ్రంథాలయాలు, చిన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు గాను 19,74,25, 749 మంది ప్రజలకు గాను 16,995 గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. మీడియం గ్రామాలలో 28,85,59,474 మంది ప్రజలకు గానూ 24,315 గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి, పెద్ద గ్రామీణ ప్రాంతాల్లో 12,37,88,205 జనాభాకు గాను 7,989 పౌర గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి. చివరగా అతిపెద్ద గ్రామీణ ప్రాంతాలలో 7, 23, 66, 805 గాను 2617 పౌర గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి. అదేవిధంగా I. క్లాస్‌ ఫోర్త్‌ , II. క్లాస్‌ ఫిఫ్త్‌, III. క్లాస్‌ సిక్స్త్‌ అంటే 20 వేల జనాభా (III. క్లాస్‌ ఫోర్త్‌) పైచిలుకు ఉన్న పట్టణాలలో 1586 గ్రంథాలయాలు, 20 వేల నుంచి 50 వేల వరకు  జనాభా ఉన్న పట్టణాలలో 987 గ్రంథాలయాలు, 50 వేల నుంచి ఒక లక్ష (III. క్లాస్‌ సిక్స్త్‌) ప్రజలు ఉన్న పట్టణాలలో 418 గ్రంధాలయాలు, ఒక లక్ష నుంచి వన్‌ మిలియన్‌ జనాభా ఉన్న 354 గ్రంథాలయాలు, వన్‌ మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి పట్టణాలలో 33 గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి.
భారతదేశంలో సుమారు లక్ష పైచిలుకు సౌర గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి. 70 వేల 817 గ్రామీణ గ్రంథాలయాలు 4580 పట్టణ గ్రంథాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
830 మిలియన్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు 370 మిలియన్ల పట్టణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నాయి అన్నమాట. అంటే 11500 గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక గ్రంథాలయం పట్టణ ప్రాంతాల్లో 80 వేల మందికి ఒక గ్రంథాలయం సరైన సేవలందిస్తున్నాయి అన్నమాట.
ఈ వారం రోజుల పాటు గ్రంథాలయాలు పాఠకులను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలు (కవి సమ్మేళనం, పుస్తక ప్రదర్శన, పుస్తక రచయితచే సంభాషణ, ఆయా ప్రాంతాలలో ఉన్న కవులను రచయితలను ఆహ్వానించి వారికి పాఠకులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి). పాఠశాలల్లోని విద్యార్థులను, కళాశాలలోని విద్యార్థులను, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాముఖ్యత గల గ్రంథాలయాలకు, లేదా వారికి దగ్గరలో గల గ్రంథాలయాలను సందర్శింపచేయాలి. పుస్తక ప్రాముఖ్యతను, పఠనం ప్రాముఖ్యతను వారికి వివరించే ప్రయత్నం చేయాలి.
At the dawn of the 21st century, where knowledge is literally power, where it unlocks the gates of opportunity and success, we all have responsibilities as parents, as Librarians, as educators, as politicians, and as citizens to instil in our children a love of reading. So that we can give them a chance to fulfil their dreams.
Barak Obama చెప్పినట్లు పౌర గ్రంథాలయాలను అన్ని వర్గాల ప్రజలను (మహిళలు, వద్ధులు, పిల్లలు, యువకులు) ఆకర్షించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వారికి కావలసిన పుస్తక వనరులను, అదేవిధంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా మహిళా గ్రంథాలయాలు కానీ, పిల్లల గ్రంథాలయాలు కానీ ఏర్పాటు చేయబడలేదు. రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాలలో, ప్రాంతీయ కేంద్ర గ్రంథాలయాలలో, జిల్లా కేంద్ర గ్రంథాలయాలలో అయా(మహిళలు, పిల్లలు) విభాగాలు ఉన్న వాటి లో పుస్తక వనరులు ఆ విభాగం సేవలు అంతంత మాత్రమే.
అదేవిధంగా గ్రంథాలయాలకు రావాల్సిన సెస్స్‌ ప్రభుత్వాలు గ్రంథాలయాలకు కేటాయించి గ్రంథాలయాల ఉన్నతికి సహకరించాలి. గ్రంథాలయంలో పనిచేసే సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది(మూడు దశాబ్దాలుగా గ్రంథ పాలకుల నియామకం లేకపోవడం). తక్షణం అర్హత గల గ్రంథాలయ సిబ్బంది నియమాకం చేపట్టవలసిన అవసరం ఉన్నది.
1980-90 వ దశకానికి అనుగుణంగా ఆనాటి ప్రభుత్వా లు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు1200 పై పౌర గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి అడపాదడప అక్కడక్కడ గ్రంథాలయాలు నెలకొల్పినప్పటికిని రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత ఆయా జనాభా ప్రాతిపదికను గ్రంథాలయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. మూడు దశాబ్దాల కింద ఏర్పాటు చేయబడ్డ గ్రంథాలయాల సంఖ్య నేడు కూడా పెరగక పోవడం దురదష్ట కరం…..వీటి సంఖ్య పెరగవలసిన అవసరమున్నది… భారతదేశంలో అత్యధికంగా గ్రంథాలయాలు ఉన్న రాష్ట్రం కేరళ అంతే స్థాయిలో వాటి నిర్వహణ, నిధుల కేటాయింపు, వాటి పనితీరు కూడా పాఠకుల మన్ననలను పొందింది.
ఢిల్లీ రాష్ట్రం గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు, నిధుల కేటాయింపు అదేవిధంగా పౌర గ్రంథాలయాలను పాఠశాల గ్రంథాలయాలను ఉపయోగించుకునే విధంగా ఢిల్లీ ప్రభుత్వం విధానాలు రూపొందించింది. తర్వాత కర్ణాటక నిధుల కేటాయింపుతో పాటు, గ్రంథాలయాల సేవలు కూడా ఉన్నత స్థాయిలో పాఠకులకు అందిస్తున్నది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఒక రెండు దశాబ్దాల కింద దేశంలోనే అత్యున్నత మన్ననలను పొందిన గ్రంథాలయ వ్యవస్థగా పేరుపొందింది.. తరువాత గ్రంథాలయాలు తమ పనితీరును కనపరచలేకపోయాయి దానికనేక కారణా లు ఉన్నాయి. ఏది ఏమైనా గత వైభవాన్ని పాఠకుల మన్ననలు పొందవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గ్రంథాలయాలు అనేవి మావి అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి. అంతేకానీ మాకు పట్టని వ్యవస్థ గా ఉండరాదు.
గ్రంథాలయాలు ప్రజలతో మమేకమైనప్పుడు మాత్రమే నాలుగు కాలాలపాటు మన కలుగుతాయి అలా మనగల గాలి అంటే గ్రంథాలయాలు ప్రస్తుత పాఠకుల అవసరాలకు అనుగుణంగా మార్పు చెందవలసిన అవసరం ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సేవలు అందించవలసిన అవసరం ఉన్నది. పాఠకులకు అవసరమయ్యే పుస్తక వనరులు సమకూర్చవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ చేయాలి అంటే ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉన్నది. తగు సమయాలలో ఆర్థిక వనరుల కేటాయింపు, గ్రంథ పాలకుల నియామకం, జాతీయ ప్రభుత్వ సహాయ సహకారాలతో (రాజా రామ్మోహన్‌ రారు లైబ్రరీ ఫౌండేషన్‌) నేషనల్‌ మిషన్‌ అన్‌ లైబ్రరీస్‌, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ వంటి సహాయ సహకారాలతో గ్రంథాలయ వ్యవస్థను పటిష్ట పరచవలసిన అవసరమున్నది.
ప్రతి వీధిలో కనీసం ఒక పబ్లిక్‌ లైబ్రరీని లక్ష్యంగా పెట్టుకొని దీన్ని దశలవారీగా పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు నడవాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, జపాన్‌, జర్మనీ, కెనడా, సింగపూర్‌ దేశాలలో ఆయా దేశాల జనాభా ప్రాతిపాదికన పౌర గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటితోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి నూతన హంగులతో అర్హత కలిగిన గ్రంథ పాలకులచే సమాచారం అందిస్తున్నారు. వాటికి కావలసిన ఆర్థిక వనరులు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. అందుకే అమెరికాను గ్రంథాలయాల స్వర్గం అని పిలుస్తారు… కారణం ఆ దేశంలో ఉన్న పౌర గ్రంథాలయాలు (జనాభాకు అనుగుణంగా) మరే దేశంలో లేవు. ఆ దేశం ఏర్పాటు చేస్తున్న పౌర గ్రంథాలయాలు కానీ, అందిస్తున్న సేవలు కానీ, పుస్తక వనరులు కానీ, మౌలిక వసతులు గాని చక్కగా ఉన్నాయి…. ఆ దేశాల ప్రజలు పౌర గ్రంథాలయాలను మావి అని సొంతం చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల గ్రంథాలయాల వినియోగంతో పాటు వాటి అభివద్ధితో పాటు ఆదరణ, నిర్వహణ కూడా అదే స్థాయి ఉంటాయి. ఒకనాడు స్వాతంత్రోద్యమంలో తలమానిక పాత్ర పోషించిన పౌర గ్రంథాలయాలు నేడు తమస్థాయిలో పనితీరు కనబరచలేకపోతున్నాయి .. కారణాలు ఏవైనా వాటిని అధిగమించి గ్రంథాలయాల పునర్జీవనంతోటి సబ్కా సాత్‌ సబ్కా వికాస్‌, మెక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాలు ప్రపంచస్థాయి దష్టిని ఆకర్షించి నాలెడ్జ్‌ గేట్‌ వేగా ఇండియా వర్ధిల్లుతుంది.

కాలక్రమేణా వస్తున్న మార్పు లకు అనుగుణంగా వద్ధాప్యాన్ని అశ్రద్ధ చేస్తున్నట్లు పుస్తకాలను, పుస్తకాల ఆలయాన్ని అశ్రద్ధ చేస్తున్నారు నేటి యువత. ఒకనాడు సమాజంలో సమస్యలపై సరియైనదారి చూపేందుకు, సామాజిక రుగ్మతలపై చైతన్యం ప్రదర్శించేందుకు గ్రంథాలయాలు అపూర్వమైన పాత్ర పోషించాయి. నేడును జ్ఞాన పర్యావరణం సమతుల్యం సాధించాలంటే గ్రంథాలయాలు అందరికీ అందుబాటులో ఉండాల్సిందే.
– ఆచార్య విప్లవ దత్‌ శుక్ల
సీనియర్‌ రచయిత విమర్శకులు
– డా|| రవికుమార్‌ చేగొని,
9866928327

Spread the love