వ్యక్తిగత ఆకాంక్షల కన్న దేశ ప్రతిష్ఠ ముఖ్యం..

– రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం

నవతెలంగాణ – రాయపోల్
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమ ఆకాంక్షల కన్న దేశం యొక్క ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఉద్యోగ, ఉపాధ్యయులందరూ దేశ రక్షణకు పాలు పడుతున్న నరేంద్ర మోడీకి మద్దతుగా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి, ఈ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.నిస్వార్థంగా  ఒక బలమైన దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవ ఎనలేనిది అని, ప్రజల రక్షణనే ద్యేయంగా రేయింబగాళ్లు కష్టపడే పోలీస్ ఉద్యోగుల సేవలు  వెలకట్టలేనివని తెలిపారు.అలాంటి వారందరు,డబ్బు సంచులతో రాజకీయాలు చేయాలనుకునే వారికీ, కులం పేరుతో ప్రజాప్రతినిది కావాలి అనుకునేవారికి మీ ఓటుతో బుద్ది చెప్పాలి. మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల గుణ గణాలు సరిచుసుకొని ఓటు వేయాలని చెప్పారు. రెండున్నర దశబద్దాలుగా ప్రజల సమస్యల సాధననే ద్వేయంగా కొట్లాడుతున్న బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Spread the love