నవతెలంగాణ క్యాలెండర్ విడుదల చేసిన చైర్మన్, డెరైక్టర్ లు..

The chairman and directors released the Nava Telangana calendar.నవతెలంగాణ – ఓయూ
మహిళ సాధికారిత, ఉపాధి కల్పన, క్రమశిక్షణ కలిగిన విద్యా ను అందించడానికి మా విద్యా సంస్థలు కృషి చేస్తున్నట్లు ఐఎస్ఓ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల చైర్మన్, రిటైర్డ్ అడిషినల్ కమిషనర్ టి.ఎన్.వెంకట స్వామి,  డెరైక్టర్ అండ్ సెకరేటరి డా.వినోద వెంకట స్వామి, అన్నారు. బుధవారం తార్నాక లో కళాశాల లో వారు స్థానిక నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్, ఓయూ పీహెచ్డీ స్టూడెంట్ తలారి. శ్రీనివాసరావు తో కలిసి నవ తెలంగాణ క్యాలెండర్స్, ఆఫీస్ క్యాలెండర్స్, డైరీ ని వారు విడుదల చేశారు. తమ విద్యా సంస్థల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు, నవ తెలంగాణ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తు, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ దృష్టి తో కాకుండా సామాజిక దృష్టితో విద్యా విధానం అందజేస్తున్నట్లు చెప్పారు. కేవలము విద్యా మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం కోసం, ఒత్తిడి మాయం చేసేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తు తమ విద్యార్థులు ఉన్నతికి తోడ్పాటు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యా వికాసం, పరిశోధన లు,నూతన ఇన్నోవేషన్స్ ద్వారానే దేశ రాష్ట్రల ప్రగతి సాధ్యం అన్నారు. కార్యక్రమంలో తమ విద్యా సంస్థలు అందజేస్తున్న విద్యా విధానం గురించి వివరించారు. కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ డా.ఉమ కొంపల్లి, మనోహర్,రాజశ్రీ, నవీన్, ప్రసాద్, పాల్గొన్నారు.
Spread the love