Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల భవిష్యత్ పై దెబ్బ

నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల భవిష్యత్ పై దెబ్బ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
దేశవ్యాప్తంగా నిర్వహించే నిట్ పరీక్షలో జరుగుతున్న అవకతవకలు, నిర్లక్ష్యం, పారదర్శకత లేకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తింటుందని ఆర్టీఐ మండల కార్యవర్గ సభ్యుడు బండి సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.బుధవారం తాడిచెర్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన పేద,మధ్యతరగతి విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతూ, రాత్రింబవళ్లు చదువుకొని మంచి ర్యాంక్ సాధించాలని కలలు కంటున్నారని తెలిపారు.తల్లిదండ్రులు అప్పులు చేసి కోచింగ్‌లు పెట్టిస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేస్తున్నారు.

కానీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న పొరపాట్లు, అవకతవకలను, అన్యాయాల వల్ల నిజాయితీగా కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు.ఒక్క పరీక్ష కోసం విద్యార్థులు సంవత్సరాల పాటు శ్రమిస్తున్నారు. అలాంటి పరీక్షలో చిన్న తప్పిదం జరిగినా వారి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొంతమంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుండగా, మరికొందరు నిరాశలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.అందువల్ల నీట్ పరీక్షను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా కేంద్ర మరియు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాశిపేట పోచయ్య,ఇందారపు దావిద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -