Sunday, August 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌ వరదలు..బురదలో 3 రోజులు ప్రాణాలతో పోరాడి 6 ఏండ్ల చిన్నారి

నేపాల్‌ వరదలు..బురదలో 3 రోజులు ప్రాణాలతో పోరాడి 6 ఏండ్ల చిన్నారి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల్లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. హిమాలయ దేశాన్ని అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల కారణంగా 650 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు జరిగిన మూడు రోజుల తర్వాత, రసూవా జిల్లాలో మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న ఆరేళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భోటే కోశి నదికి వచ్చిన వరదల వల్ల గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం శుక్రవారం గాలిస్తుండగా, శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన బృందాలు, బాలికను సురక్షితంగా బయటకు తీశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -