నవతెలంగాణ – ఆర్మూర్
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాకు గురువారం పట్టణం నుండి వందలాదిమంది న్యూడెమోక్రసీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐఏంఎల్ న్యూ డెమోక్రసీ సబ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటిన పూర్తిస్థాయిలో 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, 420 ఎన్నికల హామీలను కూడా అమలు చేయాలని అన్నారు. విద్య వైద్య సౌకర్యాలను పేద ప్రజలకు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా వేల మంది న్యూడెమోక్రసీ కార్యకర్తలతో నిర్వహించటం జరుగుతుందని అన్నారు. తరలి వెళ్లిన వారిలో న్యూడెమోక్రసీ నాయకులు ప్రిన్స్, ప్రజ సంఘాల నాయకులు రాహుల్, కళ్యాణ్, హుస్సేన్, సాయి వందలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లారు.