వాగ్దేవి పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

 నవతెలంగాణ మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచర్లలోని శ్రీవాగ్దేవి ప్రయివేటు పాఠశాలలో శనివారం 2023కు సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించి, పిల్లలు అట పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాగం కుమార్ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో నూతన విషయాలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ చదువులలో ముందు ఉంటూ తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ చదువులలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనిత, సంధ్య, మమత, లావణ్య, ఉషారాణి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love