పాఠశాల, అంగన్ వాడి కేంద్రాల్లో విద్యార్థులు నిల్.?

Nil students in school and Angan Wadi centers?– మూత పడేనా.?
– పర్యవేక్షణ చేయాలంటున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని పాత రుద్రారం 6వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రము-12లో విద్యార్థులు, చిన్నారులు లేక వేలవేలబోయాయి.గురువారం నవ తెలంగాణ పరిశీలించగా ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు చేరవాణిలో మునిగిపోయారు.అంగన్ వాడి కేంద్రంలో టీచర్,ఆయా,చిన్నారులు ఎవరు లేరు.దీంతో పాఠశాల,అంగన్ వాడి కేంద్రం మూతపడతాయోని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.సంబంధించిన మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి పాఠశాలలో, అంగన్ వాడి కేంద్రంలో విద్యార్థులు  వచ్చేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై మండల విద్యాధికారి లక్ష్మన్ బాబును వివరణ కోరగా పాఠశాలపై పర్యవేక్షణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Spread the love