హచ్‌ఏఎల్‌ ఏవియానిక్స్‌ డివిజన్‌తో నిలోఫర్‌ ఆస్పత్రి ఎంఓయూ

– భవన నిర్మాణం, వైద్య పరికరాలకు రూ.10.22 కోట్ల సాయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఏవియానిక్స్‌ డివిజన్‌ తో హైదరాబాద్‌ లకిడీకాపూల్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఓయూపై హెచ్‌ఏఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.సత్యనారాయణ, నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.ఉషారాణి సంతకాలు చేశారు. దీంతో ఆస్పత్రిలో ఒపీడీ భవన నిర్మాణానికి రూ.10.20 కోట్లు, వైద్య పరికరాలను సమకూర్చుకునేందుకు రూ.10.02 కోట్లను హెచ్‌ఏఎల్‌ నిలోఫర్‌ కు అందజేయనున్నది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉషారాణి మాట్లాడుతూ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద హెచ్‌ఏఎల్‌ ఈ నిధులను అందజేస్తున్నదని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎస్‌ఆర్‌ నిధులను ఇస్తున్నందుకు ఆమె హెచ్‌ఏఎల్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులు తెలుగు రాష్ట్రాల మహిళలు, శిశువులకే కాకుండా నిలోఫర్‌కు వచ్చే ఇతర రాష్ట్రాల మహిళలు, శిశువులకు ఉపయోగపడతాయని చెప్పారు.

Spread the love