Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌ఐటీ వరంగల్ విద్యార్థికిరూ. 1.27 కోట్ల రికార్డు ప్యాకేజీ

ఎన్‌ఐటీ వరంగల్ విద్యార్థికిరూ. 1.27 కోట్ల రికార్డు ప్యాకేజీ

- Advertisement -

నవతెలంగాణ-కాజీపేట
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ 2025-26 ప్లేస్‌మెంట్ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లోనూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) విద్యార్థి నయన్ త్యాగి ఏకంగా రూ.1.27 కోట్ల అత్యుత్తమ వార్షిక దేశీయ ప్యాకేజీ సాధించి చారిత్రాత్మక మైలురాయిని నెలకొల్పాడు. ‌యూజీ ఫలితాల్లో.. ఎన్‌ఐటీలో అర్హులైన 704 మంది విద్యార్థుల్లో 660మందికి పైగా ఉద్యోగాలు సాధించి 93.75శాతం ప్లేస్‌మెంట్ రేటు నమోదు చేశారు. సగటు సీటీసీ రూ. 18.54 లక్షలు కాగా, మీడియన్ సీటీసీ రూ.15 లక్షలుగా నమోదైంది. పీజీ ఫలితాల్లో అర్హులైన 860 మందిలో 677 మంది ఉద్యోగాలు పొంది 78.72శాతం ప్లేస్‌మెంట్ రేటు సాధించారు. వీరి సగటు సీటీసీ రూ.12.13 లక్షలు, మీడియన్ సీటీసీ రూ.9 లక్షలుగా ఉంది. రూ.70లక్షల పైబడిన ఆఫర్లు పలువురు విద్యార్థులకు లభించాయి. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో రికార్డు స్థాయిలో 360కి పైగా ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పా‌ల్గొన్నాయి. ఈ అద్భుత విజయంపై ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిధ్యాధర్ సుబుధి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. విద్యార్థులకు నిరంతరం శిక్షణ ఇస్తూ కెరీర్ అభివృద్ధికి కృషి చేసిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ పీవీ సురేష్, వారి బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డీన్‌లు, విభాగాధిపతులు, రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -