Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీఆర్సీ ప్రకటించాలి

పీఆర్సీ ప్రకటించాలి

- Advertisement -

తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 
రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

త్వరలో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి అధ్యక్షతన అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 2023 జులై 1 నుంచి రావలసిన పీఆర్సీని ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు డీఆర్ లు కూడా పెండింగ్ లో ఉన్నాయని గుర్తుచేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రకటించకుండా జాప్యంలో పెట్టారని తెలిపారు. ఆ మూడింటిపై సీఎం చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -