నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ బిగాల

– తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్

సంబరాల్లో మునిగిన నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ శ్రేణులు
నవతెలంగాణ- కంటేశ్వర్
భారత్ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గణేష్ బిగాల ని ఖరారు చేసారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపకాయలు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు తినిపిస్తూ ఎమ్మెల్యే గణేష్ బిగాల కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు  సిర్ప రాజు, యెనుగందుల మురళి, సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్, సత్య ప్రకాష్ మరియు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love