
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పీఓ, ఏ పి ఓ లకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా మొత్తం 2832 మందికి గాను 2719 మంది హాజరు కాగా మిగిలిన 113 మంది శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు అయినరాని కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. నియోజకవర్గాలవారీగా సూర్యాపేట లో 65 మంది, కోదాడ 15, హుజుర్నగర్ 23, తుంగతుర్తి 10 మంది మొత్తం 113 గైర్హాజరు అయినారని తెలిపారు. గైర్హాజరు అయినా పి ఒ, ఏ పీ ఓ లకు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10.00 గంటలకు ఎన్నికల నిర్వహణపై మరో అవకాశంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కు బుధవారం కూడా హాజరు కానీ యెడల షో కాజ్ నోటీస్ తో పాటు ఆర్.పి యాక్ట్ ప్రకారం ఎఫ్.ఐ. ఆర్. నమోదు చేస్తామని తెలిపారు.
భాద్యతయుతంగా విధులు నిర్వహించాలి:
జిల్లా లోని ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి కేంద్రాలను పరిశీలించటానికి అలాగే వాస్తవ పరిస్థితి ని జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక అందచేయుటకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు నియమించటం జరిగిందని, కేంద్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే అక్కడే ఆ కేంద్రంలో ఉన్న బృంద ప్రతినిధి కి నివృత్తి కై తెలియజేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నియమించిన అధికారులు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేసి నివేదికలను అదనపు కలెక్టర్ , ఆర్డీవో, డిఎస్పి లకు అందచేయాలని అలాగే మూడు విడతలలో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా హాజరు కాకపోయినా,సరైన రీతిలో తనిఖీలు చేపట్టకపోయినా ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.