Sunday, August 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅధికారం కాదు… రాజ్యాంగమే శాశ్వతం

అధికారం కాదు… రాజ్యాంగమే శాశ్వతం

- Advertisement -

కమ్యూనిజం అజరామరం

రాముడు అందరివాడు


హద్దులు దాటుతున్న సోషల్‌ ‌మీడియా : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌‌గౌడ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదనీ, రాజ్యాంగమే శాశ్వతమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి మహే‌శ్‌కుమార్ గౌడ్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే పత్రికాస్వేచ్ఛ కూడా బలంగా ఉంటుందని చెప్పారు. కార్పొరేట్ గుప్పిట్లోకి మీడియా సంస్థలు వెళ్తే నిజాలు మరుగు నపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థతో పాటు పత్రికా రంగం నాలుగు స్తంభాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుందని వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిందని అన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నదని విమర్శించారు. విమర్శిస్తే దేశ ద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శత్రువు లుగా చూస్తున్నదని అన్నారు. మీడియాపై ఒత్తిళ్లు తేవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

కమ్యూనిజం అజరామరం
ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడితే నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నానని దేశద్రోహి, శాంతి ప్రగతికి విఘాతం కలిగిస్తున్నారని ప్రచారం చేశారని మహే‌శ్‌కుమార్‌‌ గౌడ్‌ ‌చెప్పారు. తాను నక్సలైట్‌ ‌బాధితుడిని అయినా ఆపరేషన్‌ ‌కగార్‌‌ను వ్యతిరేకించాననీ, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ ‌చేశానని గుర్తు చేశారు. వారిది శాంతి భద్రతల సమస్య కాదన్నారు. కమ్యునిస్టులు బలపడాలని ఆకాంక్షించారు.

రాముడికి బీజేపీలో సభ్యత్వం లేదు
అధికారం కోసం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా ఎంత దూరమై‌నా పోతారని మహేశ్‌ కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. రాజకీయానికి మతాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. రాముడికి బీజేపీలో సభ్యత్వం లేదన్నారు. రాముడు అందరివాడని అన్నారు. ఎన్నికల్లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యో గాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారనీ, ఆ హామీని నెరవేర్చారా?అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు అంతకంతకు పెరుగుతూ పోతు న్నా‌యని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే దేవుళ్ల పేరిట రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు.

రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యంకాదు
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్క‌ర్‌ను అవమానించా‌రని మహే‌శ్‌కుమార్‌‌ గౌడ్‌ ‌గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదన్నారు. ‘రాజ్యాంగం బలంగా ఉంటేనే ప్రజా స్వామ్యం బలంగా ఉంటుందనీ, ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందనీ, పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటేనే ప్రజల గొంతుక సజీవంగా ఉంటుంద’ని అన్నారు.

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి
ఉద్యమ నేతగా కేసీఆర్‌‌ను గౌరవిస్తానని మహేశ్‌ ‌కుమార్‌‌గౌడ్‌ అన్నారు. కానీ రాజకీయాల్లో విమర్శలు సహజమని చెప్పారు. సీఎం రేవంత్‌‌రెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌‌ రావు మాటలు నియంత్రణలో ఉండాలని సూచించారు. మీడియా ప్రజల పక్షంగా ఉండాలనీ, ప్రభుత్వాలు చేసే మంచి పనులను సమర్థిస్తూనే తప్పులు చేస్తే ఎత్తిచూపాలని కోరారు. కుల సర్వే నిర్వహించామనీ, కేంద్రం చట్టాలను తొక్కి పెట్టిందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీ యాలను పక్కన పెట్టి నిధుల కోసం కేంద్రంతో కొట్లాడ దామని సూచించారు. తమిళ నాడు తరహాలో అధికార, ప్రతిపక్షాలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.

జెన్‌‌జీ పోరాటానికి సెల్యూట్‌
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జెన్‌‌జీ విద్యార్ధుల పోరాటానికి సెల్యూట్‌ ‌చేస్తున్నట్టు మహేశ్‌ కుమార్‌‌ గౌడ్‌ అన్నారు. విద్యార్ధి లోకాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. నాడు రైతులు, నేడు విద్యార్థుల ఉద్యమం కేంద్రం మెడలు వంచిందన్నారు.

ప్రజా సేవలో నవతెలంగాణ
నవతెలంగాణ దశాబ్దాల చరిత్ర కలిగిన పత్రిక అని మహేశ్‌కుమార్‌‌గౌడ్‌ చెప్పారు. ప్రజాశక్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి నిరంతరం ప్రజాసేవలో ప్రస్తుతం నవతెలంగాణ కొనసాగుతున్నదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -