- Advertisement -
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్
11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకం. పత్రికా యాజమాన్యానికి, సంపాదకవర్గా నికి,పాత్రికేయులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, పేదలు, బలహీనవర్గాలు, మైనారిటీల గొంతుకగా తనదైన ముద్ర వేసుకున్న నవతెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తనదైన సూచనలు, సలహాలతో గొప్ప పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సారథిగా నిలుస్తోంది. ఈ పత్రిక మున్ముందు మరింతగా ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా.
- Advertisement -



