నోటా.. 5438.. ఈసారి తగ్గిన ఓట్లు

నవతెలంగాణ – సిరిసిల్ల
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఎవరు తమకు నచ్చలేదంటూ పలువురు ఓటర్లు నోటా తో బదిలిస్తున్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో వేల సంఖ్యలో అభ్యర్థులు ఎవరు నచ్చలేదని నూట మీటర్ నొక్కిన పలువురు ఓటర్ల సంఖ్య ఈసారి ఎన్నికల్లో తగ్గింది సుప్రీంకోర్టు సూచనలతో కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నోటా అవకాశాన్ని పలువురు ఓటర్లు ఈసారి సద్వినియోగం చేసుకున్నారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన వారెవరు తమకు నచ్చలేదని వేల సంఖ్యలోని ఓటర్లు నోటా ద్వారా తమ అభిప్రాయాన్ని తేల్చారు. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నోటా విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేసింది. దీంతో అదే ఏడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో  అభ్యర్థులు ఎవరు నచ్చలేదని 5734 మంది నోటా మీట నొక్కారు. మొదటి ప్రయత్నంగా అమలు చేసిన ఈ విధానం ద్వారా వేలాదిమంది ఓటర్లు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అప్పట్లో అభ్యర్థులను విస్మయానికి గురిచేసింది. 2019లో జరిగిన కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లోను నోటా ద్వారా అభ్యర్థులు ఎవరు తమకు నచ్చలేదని తేల్చి చెప్పిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలోనే తేలింది. మొత్తం 79 మంది ఓటర్లు నోటా కి ఓట్లు వేశారు. 2014 లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో వారి సంఖ్య 2245 కు పెరగడం విశేషం ఈసారి ఎన్నికల్లో 5438 మంది నోటా కి ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోలిస్తే 2541 మంది ఈ ఎన్నికల్లో తగ్గారు. పార్టీలు తమ విధానాలు హామీలను ప్రకటించడం అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించడం ప్రలోభాలకు గురి చేయడం వంటివి చేసిన పలువురు ఓటర్లు మాత్రం వారికి నచ్చిన నాయకుడు బరిలో లేరని తేల్చడం పలు పార్టీలను విస్మయానికి గురిచేస్తుంది.

Spread the love