
విద్యార్థి దశ నుండి ప్రతి విద్యార్థి పరిశోధనలు చేసి ప్రయత్నిస్తే సాధ్యం కాదంటూ ఏదీ ఉండదని ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరి అన్నారు. బుధవారం సైన్స్ డే పురస్కరించుకొని మండలంలోని మలకపల్లి గ్రామ హైస్కూల్లో సైన్స్ డే సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సైన్సు ఉపాధ్యాయులు ఎండి రాజ మహమ్మద్ , డి నవీన్ కుమార్ , కె రజితలు 50 ఎగ్జిబిట్స్ పిల్లల చేత ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. నాగేశ్వరి మేడం ప్రారంభించి పిల్లలు ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులలో సైన్స్ టెంపర్ పెంచుట కొరకు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అట్లాగే విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ను విద్యార్థులకు వివరించారు. సివి రామన్ నోబెల్ బహుమతిని పొందారని తను కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ కు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28ని సైన్స్ డేగా ప్రకటించిందని చెప్పారు.ఈ ఎగ్జిబిట్స్ ను తిలకించటానికి పాఠశాల విద్యార్థులే కాకుండా వనమాల కనపర్తి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సెంట్ ఆంతోని విద్యార్థులు, ధర్మపురం విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు సెయింట్ జోసెఫ్ విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే సోమశేఖర్, వినయ్ కుమార్,కె ప్రేమ్ రెడ్డి,R. స్వరూప రాణి,బిక్షపతి, కృపాసాగర్, మైసయ్య, ప్రభాకర్ రెడ్డి, నరసింహ చారి, పి శ్రీనివాస్ గారలు పాల్గొన్నారు.