ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర అయిన మేడారం మినీ జాతరకు వనదేవతలను దర్శించుకోవడానికి ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డీఈ, ఆదివాసి ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, పులుసుం నాగేశ్వరరావు సతీసమేతంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేకముక్కులు చెల్లించారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి అమ్మవారి ప్రసాదం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ డీఈ పులుసం నాగేశ్వరావు మాట్లాడుతూ వనదేవతల సన్నిధిలో విధులు నిర్వహించడం ఎంతో మహాభాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు.