ఎన్ఆర్ఈజీఎస్ సోషల్ అడిట్ గ్రామసభ

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని ఖండేభల్లూర్ జీపీలో  సర్పంచ్  మహనంద శివరాజ్ దేశాయి అధ్వర్యంలో  జాతీయ మహత్మగాందీ ఉపాదీ హమీ పథకంలో భాగంగా మంగళ వారం నాడు సోషల్ అడిట్  గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా  అడిట్ అధికారులు  మాట్లాడుతూ.. గ్రామములో ఉపాదీ హమీ పథకంలో పని చేసిన కూలీల ఇంటికి వెళ్లి నేరుగా వారు చేసిన పనిదినాలు , అందిన డబ్బులు, ఇబ్బందులు, పనిచేయకుండానే డబ్బులు అందుకున్నారా ? అనే విషయాలను కూలీలతో ప్రశ్నించి విచారించారు. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసి వివరాలను గ్రామస్తులకు చదివి వినిపించి, ఎమైన అబ్యంతరాలు ఉంటే నేరుగా ప్రశ్నించి పరిష్కరించుకోవచ్చని  పేర్కోన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ , ఉప సర్పంచ్ విరేషం, జేపిఎస్ శ్రీనివాస్, అడిట్ అధికారులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love