గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వర్షాలు కురుస్తున్న దేవన్ పల్లి (తాళ్లకుంట)లో గుడిసెల లో నివసిస్తున్న పేద కుటుంబాలకు వసతులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు గుర్తించిన నిజాంబాద్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్, బాల్కొండ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ మొండి దినేష్ ఆధ్వర్యంలో వారి సొంత డబ్బులతో పేద కుటుంబాలకు తాటి పత్రాలను అందించారు. పేదలను గుర్తించి ఇలాంటి సహాయం చేసిన యువకులకు గ్రామస్తులు పేదలు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ యువకులు కార్తీక్, రేశ్వంత్, రిషి, రహీల్, అరవింద్, హర్షిత్ యువకులు పాల్గొన్నారు.