ఘనంగా ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం..

నవతెలంగాణ-కంఠేశ్వర్ : ఎన్ ఎస్ యు ఐ 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఎన్.ఎస్.యు.ఐ జెండా ఎగురవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో , కేరళ విద్యార్థి సంఘం మరియు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్‌లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్‌.ఎస్‌.యు.ఐ ని ఏర్పాటు చేశారని,నేడు ఎన్ ఎస్ యు ఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం గా ఉంది అని ఆయన అన్నారు. ఎన్ ఎస్ యు ఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడే తత్వం నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చి దిద్దుతుందని .ఎన్.ఎస్.యు.ఐ లో సంఘంలో పని చేసి ఎందరో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని వారు అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నుంచి మాజీ ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరు వెంకట్ విద్యార్థి నిరుద్యోగులు పక్షాన గలమెత్తి బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేసినందుకుగాను అధిష్టానం ఆయన కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని, అలాగే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి గతంలో ఎన్.ఎస్.యు.ఐ విభాగంలో చురుకుగా పని చేసే గుర్తించి ఈరోజు టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది, ఇలా అనేక మందికి అవకాశాలు కలిగిస్తా ఉంది ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వెంకట్ స్వామి  తో పాటు ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్న అందరికి కూడా కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు . ఎన్.ఎస్.యు.ఐ సంఘంలో పని చేసే ప్రతి ఒక్కరూ విద్యారంగ సమస్యలపై అలాగే నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని అలాగే సమాజంలో జరిగే సామాజిక రాజకీయ ఆర్థిక విషయాలపై ఎల్లవేళలా అధ్యయనం చేస్తూ సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ,ఎన్ ఎస్ యు ఐ విద్యారంగ సమస్యలపై విస్తృతంగా పోరాటం సాగిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు విశ్వవిద్యాలయాల్లోని సమస్యల పట్ల ఎప్పటికప్పుడు వాళ్ల గళాన్ని వినిపిస్తూ విద్యారంగ అభ్యున్నతి తో పాటు సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉందని వారు అన్నారు. గత సంవత్సరాల నుండి విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ విద్యార్థుల పక్షాన నిలుస్తూ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంఘం గా పేరుగాంచిన ఎన్‌.ఎస్‌.యు.ఐ అని అన్నారు .
అనంతరం బి ఆర్ ఎస్ చేసినటువంటి మోసాలను తిప్పి కొట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సాధించుకొని  ప్రజలకు ఇచ్చిన మాటను తూచా చెప్పకుండా అమలు పడుతున్నటువంటి ప్రభుత్వమే ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అంటూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక ప్రజాపాలనలో ప్రజా పథకాలు ప్రజలకు అందుతున్నాయి . 200 యూనిట్ విద్యుత్ కావచ్చు, వందలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్ ప్రయాణం . అనేక సంఘ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందుతున్నాయి, కానీ కొన్ని బీజేపీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తొలగించే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది రానున్న రోజుల్లో దేశంలో కూడా ప్రజలకు వాసాలను తెలియజేస్తూ రానున్న రోజుల్లో బిజెపి పార్టీని గద్ద దించే వరకు ఎన్ ఎస్ యు ఐ ప్రతి ఒక నాయకుడు విషమించకూడదని వారు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేకూర్చే విధంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి  ప్రవేశపెట్టినటువంటి యువ వికాస్ ని కూడా అందరూ చదివినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మరోసారి ఎన్ని వస్తాయి ఎన్ ఎస్ యు ఐ నాయకులకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ ఎస్ యు ఐ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు నరందీప్, పోచమ్మ గల్లి శివ, రాంపురం శివ,అర్ఫాష్, కౌశిక్, కనకరాజు, రాజు. ప్రభాస్ రాజ్, సందీప్ , రాజు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love