బాలిక చదువుకు భరోసా కావాలి
”భారతదేశంలోని నేటి అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి ఏమంటే ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకుని ఉదయం బడికి బయలు దేరడం”. ఏ విద్యాభిమానో భావోద్వే గంతో చెప్పిన మాటలు కావివి. న్యాయశాస్త్రాన్ని కాచి వడపోసిన ఒక సుప్రీంకోర్టు న్యాయ మూర్తి తీర్పులోని వాక్యమిది! ఈ స్పృహ మనలో ఎంత మందికి వుంది? మన విద్యారంగ పాలసీల నిర్ణేతలకు, ప్రభుత్వాలకు, సామాజిక ఉద్యమకారులకు, మేధా వులకు మాత్రం ఏ మేరకుంది? ఇలా మనలందర్నీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టుంది గదూ జస్టిస్‌ సుధాంశు దులియా చేసిన ఈ వ్యాఖ్యల్ని చూస్తుంటే!
హిజాబ్‌ ధారణను తప్పనిసరి చేసిన కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వుల్ని, దాన్ని సమర్ధించిన హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ తన అసమ్మతి తీర్పులో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అపురూపమైనవి. ఈ సందర్భంగా మన దేశంలోని ఆడపిల్లలు నాలుగంటే నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి పడుతున్న సవాలకష తంటాల్ని ఏమీ పట్టించు కోకుండా సంకుచిత మత భేషజాల చుట్టూ, రాజకీయాల చుట్టూ పిల్లల చదువుల్ని తిప్పి తిప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న మన ప్రస్తుత సామాజిక రాజకీయ ధోరణుల్ని ఆయన మందలించిన తీరు ఎంతో విలువైంది. పిల్లలు, వారి ఆకాంక్షలు, అవసరాలు, హక్కులు కేంద్రంగా లేని విద్య పట్ల ఆయన చేసిన ఈ ధిక్కారం ఇటీవల కాలంలో ఈ స్థాయి ఏ అత్యున్నత వ్యక్తీ చేయనిది.
అక్టోబర్‌ 2022లో ఆయన వెలువరించిన తీర్పు సారాంశం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
”మా ముందు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ఆడపిల్లలు! తమ గుర్తింపు కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, ఆర్టికల్‌ 25 కింద వారు రక్షణ కోరుతున్నారు. ఇస్లాంలో హిజాబ్‌ ధరించటం తప్పనిసరైన మతపరమైన నియమమా? కాదా? అనే వివాద నిర్ధారణ ఇప్పుడు అవసరం లేదు. నమ్మకం అనేది నిజాయితీతో కూడినదిగా వుండి, అది మరెవరికి హాని చేయని పక్షంలో తరగతి గదిలో హిజాబ్‌ నిషేధాన్ని సమర్థించ డానికి కారణాలు లేవు. ”ప్రస్తుత సందర్భంలో పాఠశాలవిద్యా పరిపాలనా ధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. వారికి ఏది ముఖ్యం? ఆడపిల్లలు చదువుకోవడమా? విద్యాశాఖో, పాఠశాల యాజమాన్యమో నిర్ణయించినట్లు యూనిఫారం ధరించడమా? కర్ణాటకలోని పాఠశాలల్లో హిజాబ్‌ నిషేధం అమలు వల్ల దురదృష్టవశాత్తు కొంతమంది బాలికలు తమ బోర్డు పరీక్షలకు హాజరు కాలేక పోయారని పిటిషనర్ల తరఫున హాజరవు తున్న సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. మరికొం దరు విద్యార్థినులు ఈ నిబంధన కారణంగా తాము చదువుతున్న పాఠశాలను వదిలేసి మదర్సాల్లో చేరాల్సి వస్తోంది. వాటిలోని విద్యా ప్రమాణాలు ఆశించినంత స్థాయిలో లేకపోవచ్చు.
”మన సమాజంలో బాలికలు చదువుకోవ డానికి తరగతి గది తలుపులు తెరుచుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఈరోజు ఒక ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకొని ఉదయం తన పాఠశాలకు బయలు దేరడం భారతదేశంలోని అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి. ఆమె మన ఆశ, ఆమె మన భవిష్యత్తు. అయినా ఒక ఆడపిల్లకు తన సోదరుడితో పోలిస్తే చదువుకోడం చాలా కష్టం. ఇదొక నిష్టుర వాస్తవం. మన గ్రామాల్లో, సెమీ అర్బన్‌ ప్రాం తాల్లో ఒక ఆడపిల్ల తన స్కూల్‌ బ్యాగ్‌ పట్టుకునే ముందు ఇంటిని శుభ్రం చేయాల్సి వుంటుంది. రోజువారీ పనుల్లో తన తల్లికి సహాయం చేయటం మన ఆడపిల్లలకు సర్వ సాధారణం. ఆడపిల్లకు చదువులో ఎదురయ్యే అవాంతరాలు, కష్టాలు మగపిల్లల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ. కాబట్టి ‘ఒక ఆడపిల్ల తన పాఠశాలకు చేరుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి?’ అనే కోణం నుంచి మనం చూడాలి.
”అందువల్ల ఈ న్యాయస్థానం తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న ఏమంటే ఆడపిల్లను చదువుల నుంచి తిరస్కరించడం ద్వారా మనం ఆమె జీవితాన్ని కుదింపజేస్తున్నామా అనేది. పిటీషనర్లు కోరుకునే హిజాబ్‌ ధరించడం ప్రజాస్వామ్యంలో ఏమీ అడగరానిదా? మరీ అత్యాశా? ఇది పబ్లిక్‌ ఆర్డర్‌ కో, నైతికతకో, లేదా ఆరోగ్యానికో ఎలా విరుద్ధం? మర్యాదకో, రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకో ఎలా వ్యతిరేకం. తరగతి గదిలో హిజాబ్‌ ధరించిన ఆడపిల్ల శాంతి భద్రతల సమస్యగా, చట్టానికి సంబంధించిన సమస్యగా ఎలా మారుతుందో ఎంతగా ఆలోచించినా నా తర్కానికి అందని సమస్యగానే మిగిలిపోయింది.
దీనికంటే భిన్నత్వంతో కూడిన మనలాంటి సమాజంలో చిన్నపాటి సర్దుబాట్లతో సహ జీవనానికి వీలుగా మనల్ని మనం మలుచుకోవడం పరిణతి చెందిన సమాజానికి సంకేతంగా నిలుస్తుంది. ఒక ఆడపిల్ల తన ఇంట్లో లేదా బయట హిజాబ్‌ ధరించే హక్కును కలిగి వుంటుంది. అంతమాత్రాన ఆమె పాఠశాల గేటు వద్ద ఆగిపోకూడదు. ఆమె పాఠశాలలో, తరగతిలో వున్నప్పుడు కూడా తన గౌరవాన్ని, గోప్యతను కాపాడుకోవల్సి వుంటుంది. ఆమె ప్రాథమిక హక్కులు ఆమెకుంటాయి. తరగతిగదిలో వున్నప్పుడు ఈ హక్కులు వుండవనడం పూర్తిగా తప్పు. మనం ప్రజాస్వా మ్యంలో చట్టబద్ధమైన పాలనలో జీవిస్తున్నాం. మనల్ని నియంత్రించే చట్టాలు భారత రాజ్యాంగానికి లోబడి వుండాలి. మన రాజ్యాంగం మనకు అందిస్తున్న అనేక అంశాల్లో ఒకటి విశ్వాసం. మన రాజ్యాంగం కూడా ఒక విశ్వాస పత్రమే. ఇది మెజారిటీపై మైనారిటీలు పెట్టుకున్న విశ్వాసం.
”మైనారిటీల సలహా కమిటీ నివేదికపై వ్యాఖ్యానిస్తూ సర్దార్‌ వల్లభారు పటేల్‌ 24 మే 1949న రాజ్యాంగ సభ ముందు చేసిన ఒక ప్రకటనలో ఏం చెప్పాడో చూడండి.” మైనారటీలను హడావిడిగా ఒక నిర్దిష్ట పరిస్థితులకు పరి మితం చేయటం మా ఉద్దేశం కాదు. ఈ దేశంలో మారిన పరిస్థితులలో లౌకిక రాజ్యానికి నిజమైన పునాదులు వేయడమే అందరికీ ప్రయోజనం అనే నిర్ణయానికి మైనారిటీ వారు నిజాయితీగా రావల్సి వుంటుంది. మంచిని విశ్వ సించాలి. మెజారిటీ ప్రజల నిజాయితీని విశ్వసించాలి. ఇంత కంటే మైనారిటీల కు మరొక మార్గం లేదు. అలాగే మెజా రిటీ జనాభా కూడా మన దేశంలోని మైనార్టీల మనోభా వాలు ఎలా వున్నాయో అర్థం చేసుకోడం ముఖ్యం. తాము మైనారిటీలుగా వుండి, అలాంటి పరిస్థితు లు తమకెదురైతే ఎలా వుంటామో ఆలోచించు కోవడం అవసరం”. ఇవీ ఆయన వ్యాఖ్యలు.
”కర్నాటక హైకోర్టు పిటిషనర్లు లేవనెత్తిన వైవిధ్యం ప్రశ్నను పరిగణలోనికి తీసుకోలేదు. తరగతి గది కూడా సమాజంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని వారి ఆకాంక్ష. వైవిధ్యం, మన సాంస్కృతిక బహుళత్వం ఈ సందర్భంలో చాలా ముఖ్యమైనవి.
”మన పాఠశాలలు ప్రత్యేకించి మన ప్రీ యూనివర్సిటీ కళాశాలలు పరిపూర్ణమైన సంస్థలు. వీటిలోని పిల్లలు మన దేశపు గొప్ప వైవిధ్యాన్ని గురించి జాగృతమవుతూ, ఎదుగుతున్న వయసు లోని వారు. ఇలాంటి పిల్లలకు సలహాలనిచ్చి, మార్గనిర్దేశం చేసే కేంద్రాలుగా ఇవి పనిచేయాలి. అప్పుడే మన రాజ్యాంగ విలువలైన సహనం, సర్దుబాటు వారికి ఒంటబడతాయి. ఇతర భాషలు మాట్లాడే వారి పట్ల, భిన్నమైన ఆహారపు అలవాట్లున్న వార పట్ల, వేర్వేరు బట్టలు ధరించే వారి పట్ల సహనంతో, సర్దుబాటుతో ఉండాలని మన రాజ్యాంగం చెపుతున్న విలువలు వీరి అనుభవంలోకి వస్తాయి. మన వైవిధ్యాన్ని చూసి ఆందోళన చెందకుండా, దానికి ఆనందించాలని మన పిల్లలు నేర్చుకోవలసిన సమయమిది. భిన్నత్వంలోనే మన బలమున్నదని వారు గ్రహించా ల్సిన సందర్భమిది.
”మన రాజ్యాంగం ప్రకారం హిజాబ్‌ ధరించడ మనేది ఎంపికకు సంబంధించిన, స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఇది ముఖ్య మైన, మత పరమైన ఆచారానికి సంబంధించినబాలిక చదువుకు భరోసా కావాలి
”భారతదేశంలోని నేటి అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి ఏమంటే ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకుని ఉదయం బడికి బయలు దేరడం”. ఏ విద్యాభిమానో భావోద్వే గంతో చెప్పిన మాటలు కావివి. న్యాయశాస్త్రాన్ని కాచి వడపోసిన ఒక సుప్రీంకోర్టు న్యాయ మూర్తి తీర్పులోని వాక్యమిది! ఈ స్పృహ మనలో ఎంత మందికి వుంది? మన విద్యారంగ పాలసీల నిర్ణేతలకు, ప్రభుత్వాలకు, సామాజిక ఉద్యమకారులకు, మేధా వులకు మాత్రం ఏ మేరకుంది? ఇలా మనలందర్నీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టుంది గదూ జస్టిస్‌ సుధాంశు దులియా చేసిన ఈ వ్యాఖ్యల్ని చూస్తుంటే!
హిజాబ్‌ ధారణను తప్పనిసరి చేసిన కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వుల్ని, దాన్ని సమర్ధించిన హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ తన అసమ్మతి తీర్పులో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అపురూపమైనవి. ఈ సందర్భంగా మన దేశంలోని ఆడపిల్లలు నాలుగంటే నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి పడుతున్న సవాలక్ష తంటాల్ని ఏమీ పట్టించు కోకుండా సంకుచిత మత భేషజాల చుట్టూ, రాజకీయాల చుట్టూ పిల్లల చదువుల్ని తిప్పి తిప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న మన ప్రస్తుత సామాజిక రాజకీయ ధోరణుల్ని ఆయన మందలించిన తీరు ఎంతో విలువైంది. పిల్లలు, వారి ఆకాంక్షలు, అవసరాలు, హక్కులు కేంద్రంగా లేని విద్య పట్ల ఆయన చేసిన ఈ ధిక్కారం ఇటీవల కాలంలో ఈ స్థాయి ఏ అత్యున్నత వ్యక్తీ చేయనిది.
అక్టోబర్‌ 2022లో ఆయన వెలువరించిన తీర్పు సారాంశం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
”మా ముందు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ఆడపిల్లలు! తమ గుర్తింపు కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, ఆర్టికల్‌ 25 కింద వారు రక్షణ కోరుతున్నారు. ఇస్లాంలో హిజాబ్‌ ధరించటం తప్పనిసరైన మతపరమైన నియమమా? కాదా? అనే వివాద నిర్ధారణ ఇప్పుడు అవసరం లేదు. నమ్మకం అనేది నిజాయితీతో కూడినదిగా వుండిలెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి-పెరిగిన ఉద్రిక్తతలు!
మధ్య ప్రాచ్యంలో ఏం జరుగుతోంది? ఏ క్షణంలోనైనా ప్రాంతీయ యుద్ధం జరగనుందా ? ఇప్పటికే సూయజ్‌ కాలువగుండా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలుగుతూ పడుతున్న ఇబ్బందులు మరింతగా పెరుగుతాయా ? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు సామాన్యులకు తలెత్తుతున్న సందేహాలివి. హమాస్‌ సాయుధులను అణచివేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఇజ్రాయిల్‌్‌ అక్టోబరు ఏడు నుంచి ఇంతవరకు ఆ పనిచేయలేక పోయింది. కుట్రలు, దొంగదెబ్బలతో విదేశాల్లో హమాస్‌ నేతలను హతమారుస్తున్నది. దానికి ప్రతీకారంగానే తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఒక సరిహద్దులో ఉన్న లెెబనాన్‌లో కేంద్రీకరించిన హిజబుల్లా సాయుధులు తమ మీద దాడి చేసే అవకాశాన్ని పసిగట్టి వంద విమానాలతో వారి 40 స్థావరాల మీద తామే ముందుగా ఆదివారం నాడు దాడి చేసినట్లు ఇజ్రాయిల్‌ చెప్పుకుంది.ఆదివారం నాడు 30 గ్రామాలు, పట్టణాల మీద ఇజ్రాయిల్‌ వంద విమానాలతో దాడి చేసింది.దానికి ప్రతిగా తాము ఇజ్రాయిల్‌లోని 11 మిలిటరీ స్థావరాల మీద 340 రాకెట్లను ప్రయోగించామని హిజ బుల్‌ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి నసరల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము బలమైన మిలటరీ అని, తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీని అర్ధం రానున్న రోజుల్లో దాడులు జరగవని కాదని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు గాజాలో ఇజ్రాయిల్‌ దాడులను మరింత తీవ్రం కావించింది. అల్‌ అక్సా ఆసుపత్రిలో ఉన్న రోగులను ిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి, దానిమీద దాడి చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఐరాస సిబ్బంది పని చేసే అవకాశాలు లేకుడా దాడులు జరుపుతున్నది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌లోని హౌతీ సాయుధులు కూడా దాడులకు దిగటంతో ఇజ్రాయిల్‌ మరింతగా మారణకాండ సాగిస్తున్నది. హిజబుల్లా దాడిలో జరిగిన నష్టాన్ని ఇజ్రాయిల్‌ వెల్లడి కాకుండా చూస్తున్నది. ఇరాన్‌ నేరుగా పోరుకు దిగకుండా తన మద్దతుదార్లకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్నది. తాము పూర్తి స్థాయి దాడులకు దిగటం లేదని ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ ప్రకటించారు. తమ పౌరులను రక్షించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇదే సమయంలో హిజబుల్లా కూడా దాడులను కొనసాగించటం లేదు. రెండు వైపులా లక్షా 60వేల మందిని అటూ ఇటూ వేరే ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ఒక వైపు గాజాలో దాడుల విరమణ గురించి కైరోలో చర్చలు జరుగుతుండగా తమ మీద దాడులు జరపాలని హిజబుల్లా తలపెట్టిందనే సాకుతో ఇజ్రాయిల్‌ దాడులు జరపటం చర్చలను దెబ్బతీయటం తప్ప మరొకటి కాదు. శాంతి చర్చల కారణంగా చాలా రోజులుగా తాము ప్రతీకారదాడికి దిగలేదని అయితే, ఇజ్రాయిల్‌ తెగబడినందున తాము స్పందించామని, ప్రతి దాడి ముగిసిందని హిజబుల్లా ప్రకటించగా ఇజ్రాయిల్‌ సోమవారం నాడు కూడా లెబనాన్‌ మీద దాడులు చేసింది. తమ గడ్డ మీద హమాస్‌ నేత హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి యుద్ధం లేకున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి ఉంది. హిజబుల్లా దాడిలో తాము పెద్దగా నష్టపోలేదని, తమ మిలిటరీ స్థావరాలకు ఎలాంటి హాని జరగలేదని ఇజ్రాయిల్‌ చెప్పుకుంది. గతేడాది అక్టోబరు 8 నుంచి ఇప్పటి వరకు లెబనాన్‌పై అది జరిపిన దాడుల్లో వంద మంది 566 మంది మరణించగా వారిలో సాధారణ పౌరులు 133 మంది, మిగిలిన వారు సాయుధులు మరణించినట్లు అంచనా. హిజబుల్లా దాడుల్లో 23 మంది యూదు సైనికులు, 26 మంది పౌరులు మరణించినట్లు వార్తలొచ్చాయి. రెండువైపులా లక్షలాది మంది జనం నివాసాలను వీడాల్సి వచ్చింది. ఇజ్రాయిల్‌ వద్ద అపార ఆయుధ సంపద ఉంది, ఎప్పటికప్పుడు అమెరికా, ఇతర దేశాలు కొత్తగా అందిస్తున్నాయి. అయితే హిజబుల్లా వద్ద అంత పెద్ద మొత్తంలో లేకున్నా ఇజ్రాయిల్‌లోని అన్ని ప్రాంతాల మీద దాడులు చేసేందుకు అవసరమైన రాకెట్లు ఉన్నట్లు అంచనా. లక్షా 20వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయని, అక్టోబరు ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేలు ప్రయోగించినట్లు సమాచారం. ఆధునిక డ్రోన్లతో పటు నిర్ణీత లక్ష్యాలను తాకే క్షిపణులు కూడా ఉన్నాయి. ఒక వేళ యుద్ధమే ప్రబలితే రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉంటాయి.2006లో జరిగిన నెల రోజుల పోరులో దక్షిణ లెబనాన్‌, రాజధాని దక్షిణ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. లెబనాన్‌ నాశనం కాగా ఇజ్రాయిల్‌ ఆర్ధికంగా ఎంతో నష్టపోయింది. అప్పటి నుంచి హిజబుల్లాను తుడిచిపె ట్టాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు.
గత పది నెలలుగా ఇజ్రాయిల్‌, అమెరికా లక్ష్యాలుగా సిరియా, ఇరాక్‌, ఎమెన్‌లలో ఉన్న సాయుధ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాటికి ఇరాన్‌ మద్దతు బహిరంగ రహస్యమే. ఒక వేళ ఇరానే ప్రత్యక్షంగా దాడులకు దిగవచ్చనే అంచనాతో ఇటీవల పెద్ద ఎత్తున తమ నౌకా, వైమానిక దళాలను మధ్య ప్రాచ్యానికి అమెరికా తరలించింది. విమాన వాహక యుద్ధనౌకలు కూడా వాటిలో ఉన్నాయి. ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే రక్షణ వ్యవస్థలను అమెరికా అందచేసింది.దాన్నే ఇనుప కప్పుగా పిలుస్తున్నారు. లెబనాన్‌తో ఉన్న సరిహద్ులో పరిస్థితి ఇలాగే ఉంటుందనే నమ్మకం లేదని ఇజ్రాయిల్‌ అంటున్నది. ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన తమ పౌరులు డిసెంబరు 31వరకు తిరిగి రావద్దని కోరటాన్ని బట్టి అది ఎంతగా భయపడుతున్నదో అర్ధం అవుతోంది.వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేసింది. గాజాపై తాను జరుపుతున్న దాడులను అప్పటి వరకు విరమించేది లేదన్న సంకేతం కూడా దీనిలో ఉంది. అందువలన రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉంది.
గాజాలో హమాస్‌ ఉనికి లేకుండా చేయాలని, తిరిగి అది తలెత్తకుండా ఉండాలంటే సాధారణ పరిస్థతి ఏర్పడిన తరువాత కూడా తమ మిలిటరీని అక్కడ అనుమతించాలని ఇజ్రాయిల్‌ డిమాండ్‌ చేస్తున్నది, దీని అర్ధం హమాస్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనటమే అని, దానికి ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న ఆరున్నరలక్షల మంది పిల్లలకు పోలియో వాక్సిన్‌ వచ్చినప్పటికీ దాన్ని వేసేందుకు ఇజ్రాయిల్‌ అనుమతించటం లేదు.ఐరాస సిబ్బందిని కూడా వదలకుండా దాడులు చేస్తున్నది. కాల్పుల విరమణ జరగకుండా వాక్సిన్లు వేసే అవకాశాలు లేవు. గాజాలో తొలిసారిగా పాతిక సంవత్సరాల తరువాత తొలి పోలియో కేసు నమోదైంది. మురుగునీటిని పరీక్షించినపుడు వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది.పిల్లల్లో 95శాతం మందికి వాక్సిిన్‌ అవసరమని యూనిసెఫ్‌ ప్రకటించింది.దాడులు ఆగకపోతే వాక్సిన్‌ వేయటం కష్టమని స్పష్టం చేసింది.పారిశుధ్య పరిస్థితి దిగజారటంతో పాటు మంచినీటి సరఫరాకూ ఆటంకం కలుగుతోంది. దీంతో ఇతర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఆకలి మంటలు, అనాధలుగా రోడ్ల పాలుకావటం సరేసరి.
ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే దౌత్యఎత్తుగడల పేరుతో అమెరికా ఆడిన నాటకాన్ని యావత్‌ ప్రపంచ ప్రజానీకం గ్రహిస్తు న్నది. తాను మధ్యవర్తిని అని చెప్పుకుంటూనే 1990 దశకపు ఓస్లో ఒప్పందాల నుంచి నేటి వరకు అనుసరించిన వైఖరి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ప్రధాన కారణం ఒక వైపు ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తూ భద్రతా మండలిలో దానికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని తీర్మానాలను అడ్డుకోవ టమే. పది నెలలుగా గాజా మారణకాండ సాగుతున్నప్పటికీ దాన్ని ఆపలేకపో యింది. ఇరాన్‌, లెబనాన్లలో హమాస్‌ అగ్రనేతల హత్య అమెరికాకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. నవంబరు ఐదున జరిగే ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలని అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. ఏ పరిష్కారం జరిగినా అది తమకు అనుకూలంగా ఉండాలని జోబైడెన్‌ భావిస్తున్నాడు. ఇజ్రాయిల్‌ ఓడిపోయినట్లు లేదా వెనక్కు తగ్గిందనే భావనకు వీలులేకుండా చూడాలని చూస్తే కుదరటం లేదు. అదే సమయంలో ఎన్నికల రోజు దగ్గపడేలోగా ఏదో ఒక పరిష్కారం కుదిరితే తమ విజయంగా చెప్పుకోవాలని కూడా బైడెన్‌ చూస్తున్నాడు. మధ్య ప్రాచ్య యుద్ధం జరగాలని కోరుకుంటున్న అమెరికా వలలో పడేందుకు ఇరాన్‌ సిద్ధంగా లేదు.ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉప్పునిప్పు మాదిరి సంబంధాలున్న స్థితిలో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీతో అది సయోధ్య కుదుర్చుకోవటాన్ని అమెరికా ఊహించలేదనే చెప్పాలి. ఒకవైపు తమ మద్దతుతో గాజాలో మారణకాండ సాగుతుండగా మానవత్వం గురించి కబుర్లు చెబుతున్న అమెరికా బండారం మరింతగా బయటపడుతున్నది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కొద్ది రోజుల క్రితం తమ ప్రతిపాదనను ఇజ్రాయిల్‌ అంగీకరించిందని ప్రకటించారు. అయితే కొద్ది గంటల్లోనే అలాంటిదేమీ లేదని ప్రధాని నెతన్యాహు ప్రకటించి గాలి తీశారు. ఒప్పందానికి ప్రధాని సుముఖంగా లేనందున శాంతి చర్చల్లో తమ ప్రతినిధి పాల్గొనే అవకాశం లేదని కూడా ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది. దీంతో ఒప్పందాన్ని నెతన్యాహు అడ్డుకుంటున్నట్లు రెండుదేశాల అధికారులు లీకులు వదిలారు.గడచిన పదినెలల్లో ఏడుసార్లు ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయిల్‌ పర్యటన జరిపారు. శాంతి చర్చలకు ఎప్పటికప్పుడు నెతన్యాహు కొత్త షరతులను జోడిస్తున్నారు. అమెరికా అతగాడికి వంతపాడుతూ వివాదాన్ని కొనసాగిస్తున్న దని కొందరు విమర్శి స్తున్నారు. మధ్యవర్తిగా ఉంటూ ఇలాంటి పని చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాము పోరాటం కొనసాగిస్తూనే శాంతి చర్చలకు కూడా సిద్ధమని హమాస్‌ ప్రకటించింది.చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనాలోని అన్ని విముక్తి సంస్థలతో చేతులు కలుపుతామని, పిఎల్‌ఓ ఆధిపత్యాన్ని అంగీకరించి భాగస్వాములమౌతామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.
ఎం కోటేశ్వరరావు
8331013288 , అది మరెవరికి హాని చేయని పక్షంలో తరగతి గదిలో హిజాబ్‌ నిషేధాన్ని సమర్థించ డానికి కారణాలు లేవు. ”ప్రస్తుత సందర్భంలో పాఠశాలవిద్యా పరిపాలనా ధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. వారికి ఏది ముఖ్యం? ఆడపిల్లలు చదువుకోవడమా? విద్యాశాఖో, పాఠశాల యాజమాన్యమో నిర్ణయించినట్లు యూనిఫారం ధరించడమా? కర్ణాటకలోని పాఠశాలల్లో హిజాబ్‌ నిషేధం అమలు వల్ల దురదృష్టవశాత్తు కొంతమంది బాలికలు తమ బోర్డు పరీక్షలకు హాజరు కాలేక పోయారని పిటిషనర్ల తరఫున హాజరవు తున్న సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. మరికొం దరు విద్యార్థినులు ఈ నిబంధన కారణంగా తాము చదువుతున్న పాఠశాలను వదిలేసి మదర్సాల్లో చేరాల్సి వస్తోంది. వాటిలోని విద్యా ప్రమాణాలు ఆశించినంత స్థాయిలో లేకపోవచ్చు.
”మన సమాజంలో బాలికలు చదువుకోవ డానికి తరగతి గది తలుపులు తెరుచుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఈరోజు ఒక ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకొని ఉదయం తన పాఠశాలకు బయలు దేరడం భారతదేశంలోని అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి. ఆమె మన ఆశ, ఆమె మన భవిష్యత్తు. అయినా ఒక ఆడపిల్లకు తన సోదరుడిత పోలిస్తే చదువుకోడం చాలా కష్టం. ఇదొక నిష్టుర వాస్తవం. మన గ్రామాల్లో, సెమీ అర్బన్‌ ప్రాం తాల్లో ఒక ఆడపిల్ల తన స్కూల్‌ బ్యాగ్‌ పట్టుకునే ముందు ఇంటిని శుభ్రం చేయాల్సి వుంటుంది. రోజువారీ పనుల్లో తన తల్లికి సహాయం చేయటం మన ఆడపిల్లలకు సర్వ సాధారణం. ఆడపిల్లకు చదువులో ఎదురయ్యే అవాంతరాలు, కష్టాలు మగపిల్లల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ. కాబట్టి ‘ఒక ఆడపిల్ల తన పాఠశాలకు చేరుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి?’ అనే కోణం నుంచి మనం చూడాలి.
”అందువల్ల ఈ న్యాయస్థానం తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న ఏమంటే ఆడపిల్లను చదువుల నుంచి తిరస్కరించడం ద్వారా మనం ఆమె జీవితాన్ని కుదింపజేస్తున్నామా అనేది. పిటీషనర్లు కోరుకునే హిజాబ్‌ ధరించడం ప్రజాస్వామ్యంలో ఏమీ అడగరానిదా? మరీ అత్యాశా? ఇది పబ్లిక్‌ ఆర్డర్‌ కో, నైతికతకో, లేదా ఆరోగ్యానికో ఎలా విరుద్ధం? మర్యాదకో, రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకో ఎలా వ్యతిరేకం. తరగతి గదిలో హిజాబ్‌ ధరించిన ఆడపిల్ల శాంతి భద్రతల సమస్యగా, చట్టానికి సంబంధించిన సమస్యగా ఎలా మారుతుందో ఎంతగా ఆలోచించినా నా తర్కానికి అందని సమస్యగానే మిగిలిపోయింది.
దీనికంటే భిన్నత్వంతో కూడిన మనలాంటి సమాజంలో చిన్నపాటి సర్దుబాట్లతో సహ జీవనానికి వీలుగా మనల్ని మనం మలుచుకోవడం పరిణతి చెందిన సమాజానికి సంకేతంగా నిలుస్తుంది. ఒక ఆడపిల్ల తన ఇంట్లో లేదా బయట హిజాబ్‌ ధరించే హక్కును కలిగి వుంటుంది. అంతమాత్రాన ఆమె పాఠశాల గేటు వద్ద ఆగిపోకూడదు. ఆమె పాఠశాలలో, తరగతిలో వున్నప్పుడు కూడా తన గౌరవాన్ని, గోప్యతను కాపాడుకోవల్సి వుంటుంది. ఆమె ప్రాథమిక హక్కులు ఆమెకుంటాయి. తరగతిగదిలో వున్నప్పుడు ఈ హక్కులు వుండవనడం పూర్తిగా తప్పు. మనం ప్రజాస్వా మ్యంలో చట్టబద్ధమైన పాలనలో జీవిస్తున్నాం. మనల్ని నియంత్రించే చట్టాలు భారత రాజ్యాంగానికి లోబడి వుండాలి. మన రాజ్యాంగం మనకు అందిస్తున్న అనేక అంశాల్లో ఒకటి విశ్వాసం. మన రాజ్యాంగం కూడా ఒక విశ్వాస పత్రమే. ఇది మెజారిటీపై మైనారిటీలు పెట్టుకున్న విశ్వాసం.
”మైనారిటీల సలహా కమిటీ నివేదికపై వ్యాఖ్యానిస్తూ సర్దార్‌ వల్లభారు పటేల్‌ 24 మే 1949న రాజ్యాంగ సభ ముందు చేసిన ఒక ప్రకటనలో ఏం చెప్పాడో చూడండి.” మైనార్టీలను హడావిడిగా ఒక నిర్దిష్ట పరిస్థితులకు పరి మితం చేయటం మా ఉద్దేశం కాదు. ఈ దేశంలో మారిన పరిస్థితులలో లౌకిక రాజ్యానికి నిజమైన పునాదులు వేయడమే అందరికీ ప్రయోజనం అనే నర్ణయానికి మైనారిటీ వారు నిజయితీగా రావల్సి వుంటుంది. మంచిని విశ్వ సించాలి. మెజారిటీ ప్రజల నిజాయితీని విశ్వసించాలి. ఇంత కంటే మైనారిటీల కు మరొక మార్గం లేదు. అలాగే మెజా రిటీ జనాభా కూడా మన దేశంలోని మైనార్టీల మనోభా వాలు ఎలా వున్నాయో అర్థం చేసుకోడం ముఖ్యం. తాము మైనారిటీలుగా వుండి, అలాంటి పరిస్థితు లు తమకెదురైతే ఎలా వుంటామో ఆలోచించు కోవడం అవసరం”. ఇవీ ఆయన వ్యాఖ్యలు.
”కర్నాటక హైకోర్టు పిటిషనర్లు లేవనెత్తిన వైవిధ్యం ప్రశ్నను పరిగణలోనికి తీసుకోలేదు. తరగతి గది కూడా సమాజంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని వారి ఆకాంక్ష. వైవిధ్యం, మన సాంస్కృతిక బహుళత్వం ఈ సందర్భంలో చాలా ముఖ్యమైనవి.
”మన పాఠశాలలు ప్రత్యేకించి మన ప్రీ యూనివర్సిటీ కళాశాలలు పరిపూర్ణమైన సంస్థలు. వీటిలోని పిల్లలు మన దేశపు గొప్ప వైవిధ్యాన్ని గురించి జాగృతమవుతూ, ఎదుగుతున్న వయసు లోని వారు. ఇలాంటి పిల్లలకు సలహాలనిచ్చి, మార్గనిర్దేశం చేసే కేంద్రాలుగా ఇవి పనిచేయాలి. అప్పుడే మన రాజ్యాంగ విలువలైన సహనం, సర్దుబాటు వారికి ఒంటబడతాయి. ఇతర భాషలు మాట్లాడే వారి పట్ల, భిన్నమైన ఆహారపు అలవాట్లున్న వారి పట్ల, వేర్వేరు బట్టలు ధరించే వారి పట్ల సహనంతో, సర్దుబాటుతో ఉండాలని మన రాజ్యాంగం చెపుతున్న విలువలు వీరి అనుభవంలోకి వస్తాయి. మన వైవిధ్యాన్ని చూసి ఆందోళన చెందకుండా, దానికి ఆనందించాలని మన పిల్లలు నేర్చుకోవలసిన సమయమిది. భిన్నత్వంలోనే మన బలమున్నదని వారు గ్రహించా ల్సిన సందర్భమిది.
”మన రాజ్యాంగం ప్రకారం హిజాబ్‌ ధరించడ మనేది ఎంపికకు సంబంధించిన, స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఇది ముఖ్య మైన, మత పరమైన ఆచారానికి సంబంధించిన విషయం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇది ఆ ఆడపిల్ల మనస్సాక్షికీ, నమ్మకానికీ, వాటి వ్యక్తీకర ణకూ సంబంధించించిన విషయం. ఆమె తన తరగతి గదిలో కూడా హిజాబ్‌ ధరించాలని కోరుకుంటే ఆమెను మనం ఆపలేము. ఎందుకంటే ఆమె సంప్ర దాయవాద కుటుంబం ఆమెను పాఠశాలకు పంప డానికి అనుమతించే ఏకైక మార్గం అదే కావచ్చు.
”హిజాబ్‌ను నిరాకరిస్తే తలెత్తే పరిణామం, ఆడపిల్లలకు విద్యను నిరాకరించటం! బడికెళ్లడం ఇప్పటికీ మన ఆడపిల్లలకు అంత తేలికగా లేదన్న వాస్తవం మనం విస్మరించలేము. అందువల్ల ఒక ఆడపిల్ల తన పాఠశాలకు చేరుకోవడంలో ఎదుర్కొ న్న సవాళ్ల కోణంలోనే ఈ కేసును కూడా చూడాలి. ”కేవలం హిజాబ్‌ ధరించినందుకు ఆడపిల్లలకు చదువును నిరాకరించడం ద్వారా మనం ఆమె జీవి తాన్ని మెరుగుపరుస్తున్నామా అనేది కూడా కోర్టు ముందున్న ప్రశ్న. అమ్మాయిలు స్కూల్‌ గేట్‌లోకి వెళ్లే లోపు హిజాబ్‌ తీసేయమని చెప్పటం వారి వ్యక్తిగత ఎంపిక మీద దాడి చేయడం. తర్వాత వారి గౌరవంపై దాడి చేయడం. ఆ తర్వాత వారికి లౌకిక విద్యను నిరాకరించటం. ఇది భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 19(1)(ఏ), ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 25(1)లను స్పష్టంగా ఉల్లంఘించడమే!”
– వి బాలసుబ్రమణ్యం విషయం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇది ఆ ఆడపిల్ల మనస్సాక్షికీ, నమ్మకానికీ, వాటి వ్యక్తీకర ణకూ సంబంధించించిన విషయం. ఆమె తన తరగతి గదిలో కూడా హిజాబ్‌ ధరించాలని కోరుకుంటే ఆమెను మనం ఆపలేము. ఎందుకంటే ఆమె సంప్ర దాయవాద కుటుంబం ఆమెను పాఠశాలకు పంప డానికి అనుమతించే ఏకైక మార్గం అదే కావచ్చు.
”హిజాబ్‌ను నిరాకరిస్తే తలెత్తే పరిణామం, ఆడపిల్లలకు విద్యను నిరాకరించటం! బడికెళ్లడం ఇప్పటికీ మన ఆడపిల్లలకు అంత తేలికగా లేదన్న వాస్తవం మనం విస్మరించలేము. అందువల్ల ఒక ఆడపిల్ల తన పాఠశాలకు చేరుకోవడంలో ఎదుర్కొ న్న సవాళ్ల కోణంలోనే ఈ కేసును కూడా చూడాలి. ”కేవలం హిజాబ్‌ ధరించినందుకు ఆడపిల్లలకు చదువును నిరాకరించడం ద్వారా మనం ఆమె జీవి తాన్ని మెరుగుపరుస్తున్నామా అనేది కూడా కోర్టు ముందున్న ప్రశ్న. అమ్మాయిలు స్కూల్‌ గేట్‌లోకి వెళ్లే లోపు హిజాబ్‌ తీసేయమని చెప్పటం వారి వ్యక్తిగత ఎంపిక మీద దాడి చేయడం. తర్వాత వారి గౌరవంపై దాడి చేయడం. ఆ తర్వాత వారికి లౌకిక విద్యను నిరాకరించటం. ఇది భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 19(1)(ఏ), ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 25(1)లను స్పష్టంగా ఉల్లంఘించడమే!”
– వి బాలసుబ్రమణ్యం

Spread the love