పోషణ లోపం ఏ ఊరిలో ఉండకూడదని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్తేరు రాణి శుక్రవారం అన్నారు. జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో సరైన పోషణ ఆరోగ్య తెలంగాణపై మూడు అంగన్వాడి కేంద్రాలలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించినట్లు సూపర్వైజర్ ఎస్తేర్ రాణి తెలిపారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు జక్రాన్ పల్లి మండలంలో సరైన పోషణ ఆరోగ్య తెలంగాణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ చిన్న పిల్లలకు అన్నప్రాసన గర్భిణీ స్త్రీలకు పలు జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు.