అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి: న్యాలకొండ అరుణ

నవతెలంగాణ – సిరిసిల్ల
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ పిలుపునిచ్చారు. జడ్పీసర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని, వారికి సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని,  గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులు తమ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీ.ఎఫ్.ఓ బాలమణి, జడ్పీ సీఈవో ఉమా రాణి జడ్పీ వైస్ చైర్మన్ వేణు జెడ్పిటిసిలు ఎంపీపీలు ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love