బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని సారలమ్మ గుత్తి కోయ గూడెంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాలల పరిరక్షణ విభాగం అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బయ్యక్కపేట గ్రామంలోని సారలమ్మ గుత్తి కోయ గుంపు లో ఓ మైనర్ బాలికకు వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న ఐసిడిఎస్, బాలల పరిరక్షణ, పోలీస్, రెవిన్యూ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన గారాగార శిక్ష పడుతుందని అవగాహన కల్పించారు. వారి ఇరువురి కుటుంబాలతో పెళ్లి చేయమని లిఖితపూర్వకంగా రాయించారు. ఆ బాలికను సిడబ్ల్యూ వారి ముందు హాజరు పరిచి వారి ఆదేశాల మేరకు బాలసదనం ములుగులో ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ బాలికలకు వివాహం చేస్తే చట్ట రిత్యా చర్యలకు శిక్షార్వులవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్ ఐ రాజు, డి సి పి యు సిబ్బంది, ఎల్సిపిఓ సంజీవ, సోషల్ వర్కర్ జ్యోతి, చైల్డ్ లైన్ సిబ్బంది సూపర్వైజర్ విక్రమ్, కౌన్సిలర్ రజిని, పోలీస్ అధికారి సాంబయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, గుత్తి కోయ గుంపు పెద్దమనిషి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love