
మద్నూర్ మండలంలోని గోజేగావ్ లేండి వాగు పొంగి పొర్లుతున్న సందర్భంగా వాగు వైపు ఎవరు రాకూడదని మండల శాఖ అధికారులైన తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎస్సై విజయ్, కొండా ఆర్ఐ శంకర్, తదితరులు పొంగిపొర్లుతున్న లేండి వాగును పరిశీలిస్తూ ఈ దారి గుండా ఎవరు రాకుండా ముందు జాగ్రత్తగా ముళ్ళ కంపలు వేస్తూ దారులు మూసివేశారు. మండల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ రహదారి వైపు ఎవరు రాకూడదని తెలియజేశారు. రాకపోకలు బంద్ అయిన గోజేగావ్ గ్రామ ప్రజలు లేండి వాగు వరద నీటి మూలంగా అప్రమత్తంగా ఉండాలని ఆ గ్రామ ప్రజలకు మండల తాసిల్దార్ ఎంపీడీవో ఎస్సై ఆదేశాలు జారీ చేశారు.. మండల అధికారుల వెంట పలువురు పాల్గొన్నారు.