- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : వానాకాలం పంట సాగులో భాగంగా పంటలపై సోకే చీడపురుగుల బెడద నివారణకై వ్యవసాయ రైతులు అధికారుల సూచనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి రాజు వ్యవసాయదారులకు సూచించారు. వ్యవసాయ అధికారులు శుక్రవారం మారేపల్లి గ్రామ శివారులో సోయాబీన్ పంటను పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం సోయాబీన్ పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ విశాల్ గౌడ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -