వేసవిలో నీటి కొరత లేకుండా అధికారులు తగినచర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని భుర్గుల్ గ్రామాన్ని  జెడ్.పి సీ.ఈ.ఓ ఇంచార్జి పి.డి ( డి.ఆర్.డి.ఏ ) చందర్  గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామాన్ని సందర్శించి గ్రామ పంచాయతీ నర్సరీ నీ తనిఖీ చేయడం జరిగింది. అనంతరం మండల కార్యాలయంలో గాంధారి మండలం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తో, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శి తో ఉపాధి హామీ సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఉపాధి హామీ పనులను ప్రతీ ఒక్కరికీ అందేలా చూస్తూ లేబర్ టర్నోవర్ పెంచాలని తెలిపారు.  వేసవి కాలంలో నీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపిఓ రాజ్ కిరణ్ రెడ్డి,  ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, డి.టి రవి, ఏఈఈ (RWS) అముల్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Spread the love