అక్రమ ప్రహరీ గోడను కూల్చిన అధికారులు

– సిఎంకు వినతిపై స్పందించిన అధికారులు
న‌వ‌తెలంగాణ – శామిర్ పేట్: సెలబ్రిటీ రిసార్ట్స్ లోని విల్లాలకు వెళ్ళే రోడ్డును అనధికారికంగా గత ఏడాది నిర్మించారని, ఆరంజ్ బౌల్ వద్ద రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడను తొలగించి రహదారి వేయాలని చేసిన విజ్ఞప్తికి స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్, డిపివో లతో పాటు పోలీసు అధికారులు స్పందించి గోడను జేసిబి తో తొలగించి స్థానికుల సమస్యను పరిష్కరించిన ఘటన శామీర్ పేట లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వం లో కొంతమంది అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి, తమ నివాసాలకు వెళ్లకుండా ఇబ్బందులకు గురిచేశారని సెలబ్రిటీ విల్లాల యజమానులు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సిఎం ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేసి అక్రమ గోడను కూల్చివేశారు. అంతే కాకుండా ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా నిర్మిస్తామని కూడా తెలపడం తో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్య ను పరిష్కరించడం లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ గొప్పదని వారికి ధన్యవాదాలు తెలిపారు.

Spread the love