ఓకే దఫా నాలుగు ఉద్యోగాలు సంపాదించిన వివాహిత మహిళ 

నవతెలంగాణ – రామగిరి 

పెద్దపల్లి జిల్లా  రామగిరి మండలం లద్నాపూర్ గ్రామా నికి చెందిన చిట్టిమల్ల శ్రీలత (గృహిణి) కుటుంబ పరిస్థితుల వల్ల పదో తరగతి చదువుతున్నప్పుడే తల్లిదండ్రులు చదువు ఆపేసి వివాహం చేశారు. తర్వాత చదువు మీద మక్కువతో శ్రీలత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, అలాగే పీజీని ఉస్మానియా కళాశాలలో పూర్తిచేసి సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలతో కుస్తీ పట్టి  కేజీబీవీ లో పీజీసీఆర్టి గా ఉద్యోగం సంపాదించారు. అలాగే  పలు పోటీ పరీక్షలు వ్రాశారు .కాగా,ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాలు డిఎల్, జేఎల్, పీజీటీ,  టీజీటీ, ఫలితాలలో నాలుగు ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ, తన భర్త చిట్టి మల్ల రమణ కుటుంబ సభ్యులు,మిత్రులు, గురువుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించటంతో పలువురు తనని అభినందిస్తున్నారనీ అన్నారు. అలాగే చదువుకు వయసుతో సంబంధం లేదని, చదువు కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదివితే ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆమె అన్నారు.
Spread the love