నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన బొల్లె శాంతమ్మ (75)అనే వృద్దురాలు అనుమానస్పందంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారుతెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఇంటిముందు సృహ కోల్పోయి పడివున్న శాంతమ్మను చూసి ఇరుగు పొరుగు వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి చూడగా కాళ్లు, తొడలపై భాగం కాలిన గాయాలు కనిపించడంతో వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం ఉదయం మృతురాలు కుమారులు బొల్లె వెంకటయ్య, శ్రీను తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి అనంతరం పెద్ద కుమారుడు బొల్లె వెంకటయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.