కాలం కత్తి మొనమీద

Time is on the edge of a sword.‘మత కర్మాగారాల లైసెన్సులను రద్దు చేసి : మానవతా మత మందిర నిర్మాణానికి పునాది వెయ్యండి” అంటూ సామజిక స్పహతో కవిత్వం రాస్తున్న కవి. గార రంగనాథం, కాలానికి అనుగుణంగా మార్పులను. స్వీకరస్తూ, తనదైన శైలిలో సజనాత్మకత తో కవిత్వధారలను ప్రవహింపతేస్తున్నారు. ఇటీవల రాజాం రచయితల వేదిక ఆధ్వర్యంలో ‘ఆవిష్కరించుకున్న కవితా సుపుటి ”కాలం కత్తి మొన మీద”. ఇందులో అభ్యుదయ భావజాలం తో పాటు సామాజక చైతన్యం స్త్రీ స్వేచ్చ కవితలు, ప్రకతి కవిత్వం వంటి సుమారు 60వరకు కవితలు ఉన్నాయి. ప్రజా స్వామ్యానికి తూట్లు పొడుస్తున్న నేటి సామాజిక తీరును ”అహింసా వక్షానికి అణుబాంబులు ఫలాలు. – త్యాగధనుల దేశం లో ధనస్వాముల పెత్తనాలు” అంటూ తన అభిప్రాయాన్నివ్యక్ష పరిచారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా బతుకు జీవుడా అంటూ వలసలకు పోవడం, అభివద్ధి బాట లో నిలవక పోవడం సిక్కోలు ప్రాంత ప్రజల దీనస్థితి. కరువు రక్కసి ఇక్కడ పేదరికాన్ని కంటుంది ప్రజాస్వామ్య సవతి తల్లి దాన్ని మాకు పంచుతుంది ”అనే వాక్యాలు సిక్కోలు ప్రజల జీవిత వాస్తవికతను చిత్రిస్తుంది. సహజ వనరులకు నిలయమైన భారత దేశు లో ఆదినుండి ప్రకతి ని ఆరాదిస్తూనే ఉంటుంది. కాని వేడు నాశనం చేస్తున్నాము ”ప్రకతి ఆరాధనే మునుల జీవరహస్యం. – ప్రకతి విధ్వంసకులు. కనలేరాసత్యం. అన్న కవి మాటలు అక్షర సత్యం. ఒక నాడీ ప్రకతి ఆరోగ్యదాయిని నేడు సకలరోగ ప్రదాయినిగా మారడానికి మనమే కారణం. ప్రకతి ప్రేమ పెదాలపై తప్ప విధానంలో లేదని మనం గమనించాల్సిన విషయం, కుటుంబ వ్యవస్థ బలీయమైనదని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం భారత దేశం, అలాంటి దేశంలో కుటుంబానికే వెన్నెముక లాంటి స్త్రీ జీవితానికి స్వేచ్చ లేకపోవడం, కుటుంబ స్త్రీ లకు సరియైన గౌరవం. లభించక పోవడం మానవ సమాజానికి మాయని మచ్చ, మగాడు మొగుడుగా మారిన తర్వాత ”నిన్ను భరిస్తానంటాడు – పనుపు తాడుతో నీ ఊపిరికి ఉరి బిగిస్తాడు, నీవు లేని నాడు మగాడు లేడు, నీవు లేకుంటే జగానికి మనుగడే లేదు” అంటాడు. రైతు దేశానికి వెన్నెముక. అతను లేకుంటే లేదు మనకు బ్రతుకిక, మరి అలాంటి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆమ్ముకునే స్వేచ్చ లేకపోవడం, రైతు చట్టాలు తేవడం రాజకీయ కోణం. లో ఇమిడి ఉన్న దిక్కులు. దీనికి నిరసన గా ఢిల్లీ లో లైతులు వేసిన నేపథ్యంలో రాసిన కవిత ”నాగళ్ళన్నీ రోడ్డెక్కితే”. ”ఐదు వేళ్ళు బురదలోకి జొప్పించి ం ముత్యాల పోగులు సష్టిస్తావు జాతి ఆకలి తీర్పే రంతి దేవుడువవుతావు’ అని రైతు ల పై కవికున్న గౌరవభావాన్ని వెల్లడి చేస్తారు. ఆత్మ విశ్వాసం ఉంటే దేనివైనా అధిగమించ గలం. అని నిరూపించిన మేధావి స్టీఫెన్‌ హాకింగ్‌, శరీరం. చచ్చుబడిన, మస్తిష్కపు హస్తంతో జ్ఞాన బీజాలు వెదజల్లిన కర్షకుడు, మనవాభ్యుదయం కోసం చివరి. శ్వాస వరకు శ్వాసించిన హాకింగ్‌ను సత్యాన్వేషిగా మలిచారు. వసంతం వస్తుందంటే మనకు గుర్తుకొచ్చేది కోకిల. పాట, ఆ వసంత కోకిలను వర్ణిస్తూ ”మావిచిగురు తింటే మాత్రం మా గాత్రాలకు నీ మాధుర్యం సాధ్యమా, తియ్యదనం చిగురు నుండి కంఠానికా, నీ గొంతు లోంచి చిగురికా, ప్రతి వసంతం పిలవకనే వస్తావ్‌ – కమ్మని పాటలతో మనసులను దోస్తాన్‌’. అంటూ కోకిల గొప్పతనాన్ని ప్రకతిలో దాగి ఉన్న మాధుర్యాన్ని చవిచూపెడతారు. ఈ విధంగా కాలం కత్తి మొన మీద అనే కవితా సంపుటిలో ఇంకా అనేక కవితలూ చోటు చేసుకున్నాయి. నేటి సామాజిక భక్తినీ” చూస్తుండు. గురజాడ మరికొన్నాళ్లాగితే, నీకు గుడి కట్టి అభిషేకాలు. చేస్తారు’ అని నేటి భక్తి భావం ఎక్కడకు దారితీస్తుందో అన్న సందేహాన్ని. వ్యక్త పరిచారు. అలాగే చూడరానా. ‘అప్పారాయ, ఆంధ్రనగరి, నీలాటి రేవు, దేవతా వస్తుం, అమ్మోరు, ఓ ఘోర కలీ తితిలి, చరిత్ర ఇంద్రజాలికుడు, కడలి కేరళ, రక్షకీతనం, సత్యం ఓ జ్ఞాపకం, విశ్వగురుడు, మా కళాశాల, అరకు, మొదలైన కవితలు ఉన్నాయి. ప్రతీ కవిత చదివి ఆలోచింప దగ్గ విషయమే. అక్కడక్కడా ఉత్తరాంధ్ర మాండలికాలు ‘తో పాటు త్రేతాగ్ని లాంటి పారమార్థిక పదాల తో చిత్ర కారుడు చెక్కిన బొమ్మల్లా పటం కట్టించడం రంగనాథుని రచనా వైచిత్రి.
– రాజాపు, కాంతారావు.
8495111044

Spread the love